టేకాఫ్ లో ఊడిన చక్రం.. విమానం బెల్లీ ల్యాండింగ్ , ఆ తర్వాత ఏం జరిగిందంటే ?
ముంబై ఎయిర్ పోర్టులో ఓ విమానం సాంకేతిక లోపం కారణంగా బెల్లీ ల్యాండింగ్ అయ్యింది. టేకాఫ్ సమయంలో విమానంకు చెందిన ముందు టైర్ ఊడిపోయింది. దీనితో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి అనుమతి కోరిన ఫైలెట్ , బెల్లీ ల్యాండింగ్ చేస్తునట్టు తెలిపాడు. ఈ బెల్లీ ల్యాండింగ్ లో విమానం స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ అందులోని ప్రయాణకులకు ఎలాంటి గాయాలూ కాలేదు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ లో అనారోగ్యానికి గురైన ఓ వ్యక్తి పరిస్థితి విషమించడం తో హైదరాబాద్ లో ఉన్న ఓ ప్రముఖ హాస్పిటల్ కి తరలించాలని నిర్ణయించారు. మే 6న రాత్రి నాగ్ పూర్ విమానాశ్రయం నుంచి ఎయిర్ అంబులెన్స్ బయల్దేరింది. విమానంలో ఆ పేషెంట్ తో పాటు అతడి బంధువు, ఓ డాక్టర్, ఇద్దరు క్రూ సిబ్బంది మొత్తం ఐదుగురు ఉన్నారు. విమానం గాల్లోకి ఎగిరే సమయంలోనే దాని చక్రాల్లో ఒకటి ఊడిపోయి కిందపడిపోయింది. ఆ విషయాన్ని గమనించిన పైలట్ ఏటీసీకి సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు వెంటనే ఎయిర్ ఎమర్జెన్సీ ప్రకటించారు. విమానాన్ని ముంబై ఎయిర్ పోర్టుకు మళ్లించాల్సిందిగా పైలట్‌ను ఆదేశించారు.
దీనితో వెంటనే ముంబై ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఫైరింజన్ టీమ్, రెస్క్యూ టీమ్, వైద్య బృందం, CISF సిబ్బంది స్పాట్ లో రెడీగా ఉన్నారు. అప్పటికే రన్ వే నంబర్ 27ను నురుగు తో నింపేశారు. విమానాన్ని బెల్లీ ల్యాండింగ్ చేస్తున్నట్లు పైలట్ సమాచారం ఇచ్చాడు. అత్యవసర సమయాల్లో లేదా విమానం చక్రాలు తెరుచుకొని విపత్కర పరిస్థితుల్లో విమానం తోక భాగాన్ని నేలకు తాకిస్తూ ల్యాండింగ్ చేస్తారు. దీన్ని సాంకేతిక పరిభాషలో బెల్లీ ల్యాండింగ్ అంటారు. కెప్టెన్ కేసరి సింగ్ ఎలాంటి ప్రమాదం లేకుండా విమానాన్ని రాత్రి 9 గంటల 9 నిమిషాలకు సురక్షితంగా బెల్లీ ల్యాండింగ్ చేశాడు. ఆ వెంటనే గ్రౌండ్ సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా విమానానికి పైపులతో వాటరింగ్ చేశారు. అనంతరం విమానంలో ఉన్న ఐదుగురినీ సురక్షితంగా బయటకి తీసుకొచ్చారు. దీంతో అధికారులు, బాధితుల బంధువులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ట్విటర్ ద్వారా షేర్ చేస్తూ.. వివరాలు వెల్లడించారు. విమాన క్రూ సిబ్బంది, గ్రౌండ్ సిబ్బందిని కొనియాడారు.
ఇక మరో ఘటనలో యాంటీ వైరల్ డ్రగ్ రెమ్ డెసివిర్ స్టాక్ తో ప్రయాణిస్తున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వ విమానం సాంకేతిక లోపం కారణంగా గురువారం గ్వాలియర్ విమానాశ్రయంలో కుప్పకూలిందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఘటనలో పైలట్, కో పైలట్ లకు స్వల్ప గాయాలయ్యాయని గ్వాలియర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అమిత్ సంఘి తెలిపారు. ఈ సంఘటన రాత్రి 8.30 గంటల సమయంలో గ్వాలియర్ మహారాజ్‌పురా విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో జరిగింది.. విమానం రన్ వే నుండి కొంచెం దూరం ధాటి వెళ్లిందని ఎస్పీ చెప్పారు. కరోనా వైరస్ రోగుల చికిత్స కోసం విస్తృతంగా ఉపయోగించబడుతున్న రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల కొరత దృష్ట్యా, ఔషధ రవాణా కోసం రాష్ట్ర ప్రభుత్వం తన విమానాలను ఉపయోగిస్తుంది.