విమానంలో ఆ నినాదం తప్పనిసరి..!

Update: 2019-03-05 04:51 GMT
విమానంలో ప్రయాణించేటప్పుడు కొన్ని నిబంధనలు కొత్తగా అనిపిస్తాయి. చాలా దూరం ప్రయాణించాల్సి ఉన్నందున  ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తిస్తారు ఏయిర్‌ సిబ్బంది. వారికి కావాలిసిన సౌకర్యాలను అందుబాటులో ఉంచుతూ వారిని క్షేమంగా గమ్యానికి చేరుస్తారు.

ఈ క్రమంలో విమానయాన సంస్థ ద్వారా ఉన్న కొన్ని నిబంధనలు ఏయిర్‌ సిబ్బంది పాటించాల్సి ఉంటుంది. వాటిని తప్పకుండా పాటించాలని ఆయా సంస్థలు  చెబుతున్నాయి. తాజాగా ఏయిర్‌ ఇండియా సంస్థ తమ సిబ్బందికి తాజాగా ఈ నినాదం విమానంలో తప్పనిసరి చేసింది.

ఏయిర్‌ జర్నీ చేసేటప్పుడు ప్రయాణికులు తప్పనిసరిగా సీటు బెల్టు పెట్టకోవాలి.. టేకాఫ్‌ అయ్యే ముందు ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఉపయోగించకూడదు.. లాంటి నిబంధనలు ఉంటాయి. ఇవన్నీ ఏయిర్‌ సిబ్బంది మైక్‌ లో అనౌన్స్‌ చేస్తుంటారు. ఇలా ప్రతి ప్రకటన తరువాత చివరగా 'జై హింద్‌' అని ఉండాలని ఏయిర్‌ ఇండియా సంస్థ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఏయిర్‌ హోస్ట్‌ చేసే ప్రతి ప్రకటన తరువాత 'జై హింద్‌' తప్పనిసరిగా ఉండాలని ఆ సంస్థ డైరెక్టర్‌ అమితాబ్‌ విడుదల చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు..

ఈ నినాదం ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెంపొందించేందుకేనని ఆయన తెలిపారు. ఎయిర్‌ ఇండియా సంస్థకు చైర్మన్‌ గా బాధ్యతలు చేపట్టిన తరువాత అశ్వని లోహన్‌ 2016లో ఇలాంటి ప్రకటనలు చేశారు. ఫైలట్లు తరుచూ మైక్రో ఫోన్‌ లో మాట్లాడుతూ ఉండాలని, ఎప్పుడూ కనెక్ట్‌ అయి ఉండాలని ఆయన ఆదేశాలు చేశారు. తాజాగా ఈ ప్రకటన ఆయన ఆధ్వర్యంలోనే చేయడం విశేషం. దేశ సంప్రదాయాలు కాపాడడం మన బాధ్యత అని దీనికి గల కారణాలను ఆయన పేర్కొన్నారు.
Tags:    

Similar News