పెను ప్రమాదం తృటిలో తప్పింది. దాదాపు 172 మంది ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అమెరికాలోని లాస్ వెగాస్ ఎయిర్ పోర్ట్ లో చోటు చేసుకున్న విమాన ప్రమాదం నుంచి ప్రయాణికులు అదృష్ట వశాత్తు తప్పించుకున్నారు.
బ్రిటీష్ ఎయిర్ వేస్ కు చెందిన బోయింగ్ 777 విమానం లాస్ వేగాస్ నుంచి అండన్ కు వెళ్లాల్సి ఉంది. ఇంధనం నింపుకున్న విమానం టేకాఫ్ అయ్యేందుకు రన్ వే మీదకు వచ్చింది. అంతలో ఏమైందో ఏమో కానీ.. విమానం నుంచి మంటలు.. పొగలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో 159 మంది ప్రయాణికులు 13 మంది సిబ్బంది ఉన్నారు.
వెనువెంటనే స్పందించిన సిబ్బందితో.. విమానంలోని వారంతా హడావుడిగా బయటకు దిగేశారు. అయితే.. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. ఉన్నట్లుండి విమానం నుంచి మంటలు.. దట్టమైన పొగలు చోటు చేసుకోవటంతో లోపల ఉన్న ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో.. స్పందించిన ప్రయాణికులు విమాన కిటీకీలను బద్ధలుకొట్టేసి కిందకు దిగిపోయారు.
ఒకవేళ.. విమానం కానీ టేకాఫ్ అయి ఉంటే..ఆలోచించటానికి కూడా భయపడేంత పెను ప్రమాదం జరిగి ఉండేదని చెబుతున్నారు. విమానంలో ప్రయాణికులంతా ఈ పరిణామానికి షాక్ తిన్నట్లుగా చెబుతున్నారు. కళ్ల ముందే బొమ్మ కాలిపోయినట్లుగా అంత పెద్ద విమానం కలిపోవటం ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ప్రమాదానికి కారణం ఏమిటన్నది బయటకు రాలేదు.