అమెరికాకు ఎయిర్ ఇండియా విమానాలు రద్దు.. కారణం ఇదే!

Update: 2022-01-19 09:33 GMT
మన దేశానికి చెందిన ప్రముఖ ఎయిర్ లైన్ సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. తాత్కాలికంగా ఆ సంస్థ విమానాలను కొన్ని రోజుల పాటు అమెరికాకు ఆపేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. విమాన సర్వీసులు తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతాయి అనే దానిపై తిరిగి త్వరలోనే ఓ ప్రకటన విడుదల చేస్తామని సంస్థ తెలిపింది. అంతవరకు అమెరికాకు ఎయిర్ ఇండియా విమానాలు నడపడం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సంస్థ ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. ఇందుకు ప్రధాన కారణం ఐదవ తరం సాంకేతికత.  దీంతోనే విమానాలను రద్దు చేసినట్లు తెలుస్తోంది.

ఇంతకీ ఏమైందంటే.. అభివృద్ధి చెందిన దేశాల్లో అమెరికా ఒకటి. సాంకేతికత పరంగా ఎప్పుడూ ఈ దేశం ముందంజలోనే ఉంటుంది. ఈ క్రమంలోనే కొత్తగా ఐదో తరం సాంకేతికతను దేశ వ్యాప్తం చేయాడానికి అక్కడి ప్రభుత్వం సంకల్పించింది. దీంతో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక చేస్తోంది. ఈ 5జీ రోల్ అవుట్ చేస్తున్న నేపథ్యంలో దీని ప్రభావం ఎయిర్ లైన్స్ మీద పడే అవకాశం ఉందని భావిస్తోంది. ఈ కారణంగా విమానయాన సంస్థలకు కీలక సూచనలు చేసింది అక్కడి విమానయాన శాఖ. దీంతో ప్రతికూల వాతావరణంలో విమానాలను నడపేందుకు ఏ సంస్థ సాహసించడం లేదు.  దీనిలో భాగంగానే ఈ నెల 19 నుంచి అమెరికాకు రాకపోకలను నిలిపివేసింది ఎయిర్ ఇండియా సంస్థ.
 
అమెరికా పౌర విమానయాన శాఖ తీసుకున్న నిర్ణయంతో సుమారు 12 లక్షల మంది తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నట్లు తెలిస్తోంది. అగ్రరాజ్యం తీసుకున్న ఈ నిర్ణయం సుమారు 15 వేల విమానాలపై  ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అంతేగాకుండా ప్రపంచంలోనే అతి పెద్ద విమానాశ్రయాలైన సుమారు 40కి పైగా వాటిలో ఈ ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Tags:    

Similar News