విమానంలో తిక్క‌వేషాలేస్తే...ల‌క్ష‌ల్లో ఫైన్‌

Update: 2017-04-18 10:49 GMT
ప్ర‌భుత్వ రంగ విమాన‌యాన సంస్థ ఎయిర్ ఇండియా త‌న నిబంధ‌న‌ల‌కు మ‌రింత ప‌దును పెడుతోంది. సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ - విమానాల ఆలస్యానికి కారణమయ్యే ప్రయాణికుల తాట తీసేందుకు సిద్ధ‌మ‌యింది. ఈ క్ర‌మంలో తిక్క వేషాలేస్తే ఇకపై లక్షల్లో జరిమానా క‌ట్టే విధంగా నిబంధ‌న‌లు సిద్ధం చేస్తోంది. విమాన ప్ర‌యాణం కానీ దానికి సంబంధించిన అంశాల విషయంలో కానీ అనుచితంగా వ్యవహరించే ప్రయాణికులకు భారీగా జరిమానా వడ్డించడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎయిర్ ఇండియా సంస్థ నిర్ణయించింది. గంట ఆలస్యం చేస్తే రూ.5 లక్షలు, ఒకటి నుంచి రెండు గంటలు ఆలస్యం చేస్తే రూ.10 లక్షలు - రెండు గంటలకు మించి ఆలస్యం చేసే వారికి రూ.15 లక్షలు జరిమానా వేసేందుకు ఎయిర్ ఇండియా సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది

ఇటీవలి కాలంలో వరుసగా ముగ్గురు పార్లమెంట్ సభ్యులు విమాన సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించిన నేపథ్యంలో ఎయిర్ ఇండియా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. 2015 నవంబర్‌ లో ఓ ఎంపీ ఎయిర్ ఇండియా అధికారిపై దాడికి పాల్పడ్డాడు. ఇటీవల శివసేనకు చెందిన రవీంద్ర గైక్వాడ్ 60 ఏళ్ల‌ ఎయిర్ ఇండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా తృణమూల్ కాంగ్రెస్‌ కు చెందిన ఓ మహిళా ఎంపీ కారణంగా విమానం ఆలస్యంగా బయల్దేరాల్సి వచ్చింది. ఇలా వీఐపీల చర్యలు ఉద్యోగుల ఆత్మస్థెర్యాన్ని దెబ్బతీస్తున్నాయని ఎయిర్ ఇండియా సంస్థ భావిస్తోంది. దురుసుగా ప్రవర్తించే ప్రయాణికులపై చర్యలు తీసుకోవడంతోపాటు ఉద్యోగుల - సంస్థ ప్రయోజనాలను కాపాడేందుకు పలు చర్యలు తీసుకోవాలని చైర్మన్ అశ్వని లొహానీ నేతృత్వంలోని యాజమాన్య కమిటీ భావిస్తోంది

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News