ఎయిరిండియా దూకుడు మొదలైంది. మొన్నటికి మొన్న రాజధాని ఎక్స్ ప్రెస్ ట్రైన్ల టికెట్లు, ఇప్పుడు అమలువుతున్న విధానంలో ప్రయాణ సమయం దగ్గర పడే కొద్దీ.. విమాన టికెట్ ధరల్ని భారీగా పెంచేయటం తెలిసిందే. దీని వల్ల ఆక్యూపెన్సీ సమస్యను ఎయిరిండియా ఎదుర్కొంటోంది. పోటీ విమానయాన సంస్థలతో పోల్చినప్పుడు ఎయిరిండియా టికెట్ ధరలు ఎక్కువగా ఉండటం.. లాస్ట్ మినిట్ టికెట్ ధరలు భారీగా ఉన్న నేపథ్యంలో పూర్తి సామర్థ్యంతో విమానాలు నిండని పరిస్థితి. ఈ సమస్యను అధిగమించేందుకు వీలుగా.. ఎంపిక చేసిన కొన్ని రూట్లలో రాజధాని ఏసీ సెకండ్ క్లాస్ టికెట్ ధరలకే లాస్ట్ మినిట్ ఫ్లైట్ టికెట్ ను అమ్మాలని ఎయిరిండియా తాజాగా నిర్ణయించింది.
కన్ఫర్మ్ కాని వారికి ఎయిరిండియాలో జర్నీ చేసేందుకు వీలుగా రైల్వే శాఖతో ఒప్పందం చేసుకున్న ఈ ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన కొన్ని రూట్లలో లాస్ట్ మినిట్ టికెట్ల రేట్లను చౌకగా ఉండేలా నిర్ణయం తీసుకుంది. ఈ సౌకర్యం ఢిల్లీ నుంచి ముంబయి.. చెన్నై.. కోల్ కతా.. బెంగళూరు వెళ్లే ఎయిరిండియా విమాన సర్వీసులకే వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం ఢిల్లీ.. ముంబయి మధ్యన రాజధాని సెకండ్ ఏసీ టికెట్ ధర రూ.2870 ఉండగా.. ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లే రూట్ లో ట్రైన్ టికెట్ ధర రూ.3905 ఉంటోంది. ఈ ధరలకే ఆఖరి నిమిషంలో ఎయిరిండియా విమానటికెట్లు లభించే సౌకర్యం కలిగించటంతో.. ఎయిరిండియా ఆక్యూపెన్సీ పెరుగుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకాలం తర్వాత ప్రైవేటు విమానయాన సంస్థలకు ధీటుగా ఎయిరిండియా నిర్ణయాలు తీసుకోవటం విశేషం.