విమాన నడిపే పైలెట్ కు వైరస్ పాజిటివ్ అని తెలియడంతో ఆగమేఘాల మీద ఎయిరిండియా విమానాన్ని వెనక్కు రప్పించారు. ఢిల్లీ నుంచి మాస్కో వెళ్తున్న ఏ 320 విమానం పైలెట్ కు కరోనా పాజిటివ్ అని గ్రౌండ్ సిబ్బంది తెలుసుకోవడంతో గాల్లోనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. విమానం టేకాఫ్ తీసుకోవడానికి ముందు నిర్వహించిన పరీక్షలో పొరపాటు వల్ల ఇలా జరిగిందని అధికారులు చెప్పారు. విమానం బయలు దేరడానికి ముందు అన్నీ చెక్ చేసుకుంటారు. ఆ క్రమంలో పైలెట్ ఆరోగ్యం గురించి కూడా అందులో నెగిటివ్‌గా చదువుకున్నారు. దీంతో అతడు యధావిధిగా విధులకు హాజరయ్యాడు.
అసలు ఆ విమానం ఎక్కడికి వెళ్తుంది అంటే ..వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకు వచ్చేందుకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి మాస్కో కి బయల్దేరింది. అయితే, ఆ విమానం ఉజ్బెకిస్తాన్ గగనతలంలోకి చేరుకున్న తర్వాత ఢిల్లీలో ఉన్న విమానాశ్రయ సిబ్బంది పైలెట్ కు కరోనా పాజిటివ్ అనే విషయాన్ని గుర్తించారు. వెంటనే వెనక్కి రావాలని ఆదేశించడంతో విమానం మధ్యాహ్నం 12.30 గంటలకు మళ్లీ ఢిల్లీ చేరుకుంది. ఆ వెనువెంటనే విమాన సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. దీనితో మాస్కోలో ఉన్న వారిని తీసుకొచ్చేందుకు మరో విమానాన్ని పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.