ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ద్వారా భారీగా నిధులు సమకూర్చుకోవాలని కేంద్రం నిర్దేశించుకుంది. కానీ, ఆ లక్ష్యాలని అందుకోవడానికి కరోనా అడ్డుగా నిలిచింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఫైనల్ బిడ్డర్ పేరు దాదాపు ఖరారు కావాల్సి ఉంది. కానీ, కరోనా రెండో వేవ్…దాని నియంత్రణకు వ్యాక్సినేషన్ ప్రక్రియలో కేంద్రం పూర్తిగా నిమగ్నం కావాల్సిన పరిస్థితి నెలకొంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డౌటే అని తెలుస్తుంది. కరోనా సెకండ్ వేవ్, వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఉండగా పరిస్థితులు అనుకూలంగా లేవని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటీకరణ అనుమానమేనని నిపుణులు చెబుతున్నారు.
వచ్చే సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి ఎయిర్ ఇండియాను టేకోవర్ చేసే సంస్థ పేరును కేంద్రం ప్రకటించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ, పూర్తిగా ప్రైవేటీకరణ ద్వారా కేంద్రం రూ.1.75 లక్షల కోట్ల నిధులను సమకూర్చుకోవాలని లక్ష్యాలను నిర్దేశించుకున్నది. కేంద్ర ప్రభుత్వ రంగ బీమా సంస్థ.. భారతీయ జీవిత బీమా సంస్థ లో ఐపీవో ద్వారా రూ. లక్ష కోట్లు సేకరించాలని కేంద్రం ప్రణాళిక. టాటా సన్స్ ఎయిరిండియాను టేకోవర్ చేసుకునేందుకు ముందు వరుసలో ఉంది. ఈ మేరకు అధికార వర్గాలు చెబుతుండగా స్పైస్ జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ తోపాటు ఇతర సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. కానీ టాటా సన్స్, అజయ్ సింగ్ బిడ్లు మాత్రమే కేంద్రం ఓకే చేసినట్లు తెలుస్తుంది.
ఇప్పటికైతే ఎయిర్ ఇండియాను టేకోవర్ చేసే విషయమై టాటా సన్స్ ఆశాభావంతో ఉంది. కేంద్ర ప్రభుత్వ నూతన ప్రణాళికలో భాగంగా కొవిడ్-19 మహమ్మారిని నియంత్రించడంలో టాటా సన్స్ సహకరిస్తుంది. అయితే, ఈ విషయమై తాము ఇప్పటికైతే ద్రుష్టిని కేంద్రీకరించలేదని టాటా సన్స్ అధికారి ఒకరు చెప్పారు. ప్రభుత్వం నుంచి వచ్చే సూచనలను అనుసరిస్తామన్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌కు గానీ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియ పొడిగించామని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. మరో మూడు నెలల్లో ఎయిర్ ఇండియా ఫైనల్ బిడ్లను వెల్లడిస్తామన్నారు. అంటే ఎయిరిండియా కొనుగోలు దారు పేరును ఈ ఏడాది ప్రకటిస్తామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ఇండియా కొనుగోలు దారును కేంద్రం ప్రకటించనున్నది. కానీ దానిని సదరు సంస్థకు హ్యాండోవర్ చేయడానికి సమయం పడుతుందని అధికార వర్గాల సమాచారం. అలాగే , మరో మూడు నెలల్లో ఎయిర్ ఇండియా ఫైనల్ బిడ్లను వెల్లడిస్తామని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పినట్లుగా జాతీయ మీడియా చెబుతుంది. 20 ఏళ్లుగా ఎయిర్ ఇండియా ప్రైవేటీకరించడానికి కేంద్రం ప్రయత్నిస్తూనే ఉంది. అప్పట్లో 20 శాతం వాటా విక్రయానికి పెట్టింది. 2017లో 74 శాతం వాటాను విక్రయించడానికి కేంద్రం పచ్చ జెండా ఊపినా, టేకోవర్ చేయడానికి ఏ సంస్థ కూడా ముందుకు రాలేదు. దీనితో తాజా ప్రతిపాదనల్లో పూర్తిగా విక్రయించడానికి నిర్ణయించింది.