నాన్ వెజ్ వడ్డించటం ఆపలేదంట

Update: 2015-12-26 16:15 GMT
ఒకదాని తర్వాత ఒకటిగా బయటకు వస్తున్న వివాదాల నేపథ్యంలో.. సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఎయిర్ ఇండియా విమానాల్లో నాన్ వెజ్ ఐటెమ్స్ ను వడ్డించటం బంద్ చేయనున్నారన్న కొత్త ప్రచారం ఒకటి మొదలైంది. ఈ వార్తలు వచ్చిన వెంటనే.. నాన్ వెజ్ ఎందుకు వడ్డించ కూడదంటూ ఎవరు నిర్ణయం తీసుకున్నారన్న విషయం మీద దృష్టి పెట్టటం వదిలేసి.. విమర్శలు చేసుకోవటం మొదలైంది.

తిండి యవ్వారాలు ఈ మధ్య తరచూ రాజకీయ రంగు పులుముకుంటున్న వేళ.. ఎయిర్ ఇండియా విమానాల్లో నాన్ వెజ్ వడ్డించరంటూ నిర్ణయం తీసుకొని.. జనవరి 1 నుంచి అమలు చేయాలనుకుంటున్నట్లుగా వచ్చిన ఊహాగానాలు వివాదంగా మారాయి. చిత్రమైన విషయం ఏమిటంటే.. ఇలాంటి వాదనలు వెలుగులోకి తీసుకొచ్చే వారు కానీ.. దీని గురించి నోరు పారేసుకునే వారు కానీ.. సాక్ష్యాలు చూపించి ఇలాంటి ఆరోపణలు చేస్తారా? అంటే అలాంటిదేమీ కనిపించదు.

ఇలాంటి నేపథ్యంలోనే వివాదం పెద్దదైతే జరిగే నష్టాన్ని గుర్తించిన ఎయిర్ ఇండియా.. నాన్ వెజ్ వడ్డించటం ఆపేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని.. అలాంటి నిర్ణయాన్ని తాము తీసుకోలేదంటూ తేల్చి చెబుతున్నారు ఎయిర్ ఇండియా అధికారులు. ఏదైనా అంశంపై రాజకీయ విమర్శలు చేసేవారు కాస్తంత వెనుకా ముందు చూసుకొని మాట్లాడితే.. అనవసరమైన భావోద్వేగాలు రగలకుండా ఉంటాయన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Tags:    

Similar News