ఎయిర్ ఇండియా మూత్ర విసర్జన ఘటనలో నిందితుడికి బెయిల్ నిరాకరణ..!

Update: 2023-01-12 11:18 GMT
ఎయిర్ ఇండియా విమానంలో 70 ఏళ్ల మహిళపై మద్యం మత్తులో ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన హేయమైన ఘటన ఇటీవల సంచలనంగా మారింది. ఈ సంఘటన నేపథ్యంలో సదరు వ్యక్తిపై పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత సదరు మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆ వ్యక్తిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో నిందితుడిగా ఉన్న శంకర్ మిశ్రాను పోలీసులు శుక్రవారం బెంగళూరు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశాలు చేసింది. అయితే అంతకుముందే శంకర్ మిశ్రా ఢిల్లీలోని పటియాలా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా అందుకు న్యాయం స్థానం తోసిపుచ్చింది.

బెంగూళూరు కోర్టులోనూ అతనికి చుక్కెదురైంది. తనకు ఎటువంటి నేర చరిత్ర లేదని.. సాక్ష్యుల ప్రభావితం చేసే స్థాయి తనకు లేదని అందుకే బెయిల్ కావాలని కోర్టుకు విన్నవించాడు. అయితే కేసు ఈ స్టేజ్ లో ఉన్నపుడు బెయిల్ ఇవ్వడం సరికాదని న్యాయస్థానం అభిప్రాయపడింది. పైగా శంకర్ మిశ్రా మహిళ పట్ల వ్యవహరించిన తీరు ఏమాత్రం సహించ రానిదని అంటూ వ్యాఖ్యానించింది.

అయితే శంకర్ మిశ్రా తరపు న్యాయవాది వాదిస్తూ శంకర్ మిశ్రా లైంగిక కోరికలతోనే లేదంటే ఆమె పట్ల దౌర్జన్యంతో ఇలా వ్యవహరించలేదని తెలిపాడు. అయితే మహిళ తరుపు న్యాయవాది మాత్రం తన క్లయింట్ ను బెదిరింపులకు గురి చేశారనే విషయాన్ని జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. నిందితుడి తండ్రి బెదిరింపులకు గురిచేసేలా ఫోన్లో సందేశాలు పంపించాడని.. ఇంతకు ఇంతకు అనుభవిస్తావు అంటూ మెసేజ్ పెట్టి డిలీట్ చేసినట్లు వివరించాడు.

ఇరువురి వాదనలు విన్న కోర్టు శంకర్ మిశ్రాకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే అంతకు ముందు పోలీసులు శంకర్ మిశ్రాను తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. అయితే కోర్టు మాత్రం అందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలోనే అతడికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని కోర్టు విధించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News