ఎన్నికల వేళ అనవసరమైన విమర్శల్లోకి చిక్కుకోకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవటం మామూలే. అయితే.. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అధికారపక్షం మీద తమకున్న అభిమానాన్ని అదే పనిగా ప్రదర్శిస్తుంటారు. విమర్శలు ఎదురైతే ఎదురు కానీ.. తమ భజనను ఆపేందుకు ఇష్టపడరు. అలాంటి తీరు తాజాగా రచ్చగా మారి.. పలువురు విమర్శలు చేయటంతో కళ్లు తెరుచుకున్న వైనం ఆసక్తికరంగా మారింది.
ప్రధాని నరేంద్రమోడీ.. గుజరాత్ ముఖ్యమంత్రి ఫోటోలు ఉన్న ఎయిరిండియా బోర్డింగ్ పాసుల వ్యవహారం ఇప్పుడు కలకలం రేపింది. ఎన్నికల వేళ.. ఇలాంటి పాసులు ఇష్యూ చేస్తారా? అంటూ ప్రశ్నించటమే కాదు.. అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంతకూ జరిగిందేమంటే.. పంజాబ్ మాజీ డీజీపీ శశికాంత్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు.
అందులో తాను తాజాగా ప్రయాణించిన ఎయిరిండియా జారీ చేసిన బోర్డింగ్ పాస్ ను షేర్ చేశారు. ఆ బోర్డింగ్ పాసు వెనుక ప్రధాని మోడీ ఫోటో.. గుజరాత్ ముఖ్యమంత్రి ఫోటో ఉంది. దీనిపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో ఇలాంటి వాటిని చూడని.. వినలేని.. మాట్లాడలేని ఎన్నికల సంఘంపై ప్రజాధనం వృథాగా ఖర్చు చేయటం ఎందుకు? అని ప్రశ్నిస్తూ బోర్డింగ్ పాసును పోస్ట్ చేశారు. దీనిపై ఎయిరిండియా స్పందించింది.
మోడీ ఫోటోతో ఉన్న బోర్డింగ్ పాసుల్ని ఇష్యూ చేయటం ఆపేయనున్నట్లు ప్రకటించింది. జనవరిలోజరిగిన వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ సమయంలో ఈ పాసుల్ని జారీ చేశారని.. వేరే వ్యాపార సంస్థ ప్రకటనలో భాగంగా వాటిని ముద్రించామని.. మిగిలిన వాటిని వాడే క్రమంలో చూసుకోలేదని చెప్పుకొచ్చింది. కీలకమైన ఎన్నికల వేళ.. ఇలాంటివి అనుకోకుండా జరిగినట్లుగా చెప్పే మాటలు అతికినట్లుగా ఉంటే మరింత బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.