దేశంలో ఇంత మంది ముఖ్యమంత్రులు ఉన్నా.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎదురయ్యే సమస్యలు.. సవాళ్లు మరెవరికీ ఎదురుకావనే చెప్పాలి. అయితే.. తనకు ఎదురైన ప్రతికూలతల్ని పరిష్కరించుకోవటంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు.తాజాగా అలాంటి పరిస్థితే మరోసారి ఎదురైంది. గతంలో ఆమె ప్రయాణిస్తున్న విమానాల్లో సాంకేతిక సమస్యలు ఎదురుకావటం తెలిసిందే.
తాజాగా ఆమె ప్రయాణిస్తున్న చార్టర్ ఫ్లైట్ తీవ్రమైన కుదుపులకు లోనైంది. దీంతో.. ఆమె వెన్నుముకకు గాయమైంది. దీనిపై మమత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహానని వ్యక్తం చేస్తోంది. సీఎం ప్రయాణిస్తున్న విమానం కుదుపులకు లోను కావటం ఏమిటంటూ.. దానికి సంబంధించిన నివేదికను ఇవ్వాలని కోరింది.
తాజాగా జరుగుతున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆమె.. సమాజ్ వాదీ పార్టీ తరఫున ప్రచారం చేవారు. ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించటం గమనార్హం.
ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని తిరిగి పశ్చిమ బెంగాల్ కు బయలుదేరిన ఆమె.. చార్టర్ ఫ్లైట్ లో ప్రయాణిస్తున్నారు. ఈ సందర్భంగా వీచిన ఈదురుగాలులతో విమానం తీవ్ర కుదుపులకు లోనైంది.
దీంతో అప్రమత్తమైన పైలెట్ ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా విమానాన్ని సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సేఫ్ గా ల్యాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఎం మమత వెన్నుపూసకు గాయమైందని చెబుతున్నారు.
ఒక ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న విమానం ఇలాంటి పరిస్థితులు ఎదురుకావటం ఏమిటి? అంటూ ప్రశ్నిస్తూ.. ఏవియేషన్ డిపార్ట్ మెంట్ కు నివేదిక ఇవ్వాలని కోరుతూ లేఖ రాశారు. సీఎంవో కోరినట్లుగా నివేదిక సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఏమైనా.. మమత ప్రయాణించే విమానాలకు ఇలాంటి సాంకేతిక సమస్యలు తరచు ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. ఈ తీరుపై ఆందోళన వ్యక్తమవుతోంది.