ఏదైనా అర్జెంట్ పని మీద కార్ లో వెళ్తున్నప్పుడో.. లేదా గర్ల్ ఫ్రెండ్ తో లాంగ్ డ్రైవ్ కి వెళ్తున్నప్పుడో మధ్యలో కారు టైర్ పంక్చర్ అయితే చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది కదా. ఇక దగ్గర లో పంక్చర్ షాపులు లేకపోతే అంతే సంగతి. అయితే త్వరలో ఈ సమస్యకు చెక్ పడనుంది. గాలి తో ఉండే టైర్ల స్థానంలో టెస్లా ఎయిర్లెస్ టైర్లు రానున్నాయి. ఇప్పటికే ఈ టైర్ల టెస్ట్ రైడ్ చేశారు.
రహదారిపై అప్పుడప్పుడు టైర్ పంక్చర్ అయిన కార్ల ను చూస్తుంటాం. టైర్ లో గాలి ప్రెజర్ చూసుకోకపోవడం కూడా దీనికి ఓ కారణం. కారులో అన్నింటికంటే బలహీనమైన పార్ట్ ఏదంటే టైర్లనే చెబుతుంటారు. అయితే త్వరలో టైర్ల కిస్మత్ మారనుంది. ఇప్పటి వరకు గాలి తో ఉన్న టైర్లనే చూశాం. అర్జెంట్ పని మీద వెళ్లినప్పుడు అవి మధ్యలోనే హ్యాండ్ ఇచ్చే సంప్రదాయానికి చెక్ పడనుంది.
1890 ల్లో మొదటిసారిగా గాలితో నిండిన టైర్లను ఉపయోగించారు. వీటి స్థానంలో ఇప్పుడు కొత్త టైర్లు రానున్నాయి. లక్సెంబర్గ్‌లోని ఒక ట్రాక్‌పై టెస్లా మోడల్-3ను ఇటీవల టెస్టు రైడ్ చేశారు. దీనిలో అమెరికాకు చెంది గుడ్ ఇయర్ సంస్థ తయారు చేసిన నాలుగు వాయు రహిత టైర్లు (ఎయిర్‌లెస్ టైర్లు) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ టైర్లలో ప్రత్యేకమైన ప్లాస్టిక్ స్పోక్స్, రబ్బరుతో చేసిన పుల్లలు ఉన్నాయి. కారు వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఉండే ఎత్తు పల్లాలకు అనుగుణంగా ఈ టైరు నడుస్తుంది.
'' ఈ టైర్లు కొంచెం శబ్దం వస్తాయి. చిన్న వైబ్రేషన్ కూడా ఉంటాయి. అయితే రైడ్‌ను మరింత హాయిగా మార్చేందుకు వీటిని మెరుగుపరుస్తున్నాం. వీటితో ప్రయాణిస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు''అని గుడ్ ఇయర్ సంస్థలోని నాన్ న్యుమేటిక్ టైర్స్ (ఎన్‌పీటీ) విభాగం సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ మైఖెల్ రచిట చెప్పారు. గాలితో నిండి ఉండే టైర్ల స్థానాన్ని ఇవి పూర్తిగా భర్తీ చేస్తాయని చెప్పడం లేదు. కానీ, ఇప్పుడు మనకు కొత్త పరిష్కారాలు కావాలి. మనం అటానమస్ వెహికల్స్ సాధారణమైపోయే ప్రపచంలోకి అడుగు పెట్టాం.
ఇప్పుడు చాలా నగరాల్లో రవాణా సదుపాయాలను వ్యూహాత్మక సేవల రంగంలో భాగంగా చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండే టైర్లు ప్రధాన పాత్ర పోషించే అవకాశముంది. వేల మైళ్ళు ఇవి హాయిగా వెళ్లగలుగుతున్నాయి. కొన్నిసార్లు టైర్లలోని స్పోక్స్ విరుగుతున్నాయి. అయినప్పటికీ వీటితో ఎలాంటి ప్రమాదమూ ఉండదు. ప్రస్తుతం ఇవి పరీక్షల దశలో ఉన్నాయి. అయితే, ఇవి మాకు నమ్మకాన్ని ఇస్తున్నాయి. ఇవి బాగా పని చేస్తాయని మేం కచ్చితంగా చెప్పగలను'' అని మైఖేల్ వివరించారు.
వాయు రహిత టైర్ల కోసం జనరల్ మోటార్స్ (జీఎం)తో కలిసి 2019 నుంచి మిషెలిన్ పనిచేస్తోంది. మిషెలిన్ ప్రత్యేకంగా తయారు చేసిన పంక్చర్ ప్రూఫ్ టైర్ సిస్టమ్ (యూపీటీఐఎస్)ను చెవ్రోలెట్ బోల్ట్ ఎలక్ట్రిక్ కార్లలో ఉపయోగించే అవకాశముందని, 2024 నాటికి ఇవి అందుబాటులోకి రావొచ్చని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ యూపీటీఐఎస్ టైర్లను అత్యంత దృఢంగా ఉండే రేసిన్ పాలిమర్లు, ఫైబర్‌గ్లాస్, కంపోసైట్ రబ్బర్‌లను ఉపయోగించారు. ఇది నడిచినప్పుడు అల్యూమినియం తరహా శబ్దం వస్తోంది. ఈ టైర్ల కోసం 50 పేటెంట్లకు మిషెలిన్ దరఖాస్తు చేసింది. బోల్ట్ కార్లలో ఈ టైర్లను ఉపయోగిస్తారనే వార్తలను మిషెలిన్ సంస్థ సైంటిఫిక్, ఇన్నోవేషన్ ఎక్స్‌పర్ట్ సిరిల్ రోజెట్ ధ్రువీకరించలేదు. అయితే, ఈ ఏడాది చివర్లో దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని అన్నారు.
ఎయిర్ లెస్ టైర్లు కొత్తలో కాస్త ఎక్కువ ధర ఉండొచ్చు. అయితే, 3డీ ప్రింటింగ్‌తో దీనిలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశముంది. ఇప్పటికిప్పుడే ఈ టైర్లను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు. మరికొందరు అయితే, ఈ టైర్లను ముందు ఉచితంగా అందించి, వీటిలో ఉండే సెన్సార్ల సాయంతో ఎన్ని మైళ్ళు ప్రయాణించారో గుర్తించి, దాని ప్రకారం డబ్బులు వసూలు చేసే పరిజ్ఞానం అందుబాటులోకి రావొచ్చని వివరిస్తున్నారు.
''భవిష్యత్ టైర్లను టెక్నాలజీనే నడిపిస్తుంది''అని గుడ్ ఇయర్‌లోని టైర్ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన విశ్లేషకురాలు సోసియా కాసెరెట్ జోస్టెన్ చెప్పారు. ''రోడ్డు, వాహనాల మధ్య ఏకైక కాంటాక్ట్ టైర్లు మాత్రమే. అందుకే భవిష్యత్ టెక్నాలజీ దీనితో ముడిపడి ఉండబోతోంది''అని ఆమె అన్నారు. కొత్తగా అందుబాటులోకి వచ్చే అన్ని టెక్నాలజీలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాయని అనుకోకూడదని.. భద్రత, సౌకర్యం, పెర్ఫార్మెన్స్, సస్టెయినబిలిటీ అనేవే ఇక్కడ ముఖ్యమని తెలిపారు. ప్రస్తుతం ఇవన్నీ మనకు గాలితో నిండిన టైర్లతో లభిస్తున్నాయి. కొత్తగా వచ్చే టెక్నాలజీలు దీన్ని భర్తీ చేసేలా ఉండాలి అని జోస్టెన్ వివరించారు.