జియో పేరుతో 4జీ సేవల మార్కెట్ లోకి వస్తూనే కలకలం రేకెత్తిస్తున్న రిలయన్స్ దెబ్బకు బడా సంస్థలు దిగివస్తున్నాయి. మొబైల్ సేవల రంగంలో ప్రథమ స్థానంలో ఉండటమే కాదు.. చార్జీల వసూళ్లలో కూడా అడ్డగోలుగా వ్యవహరిస్తుందనే ఆరోపణ ఉన్న ఎయిర్ టెల్ తాజాగా తన దూకుడు తగ్గించుకుంది. రిలయెన్స్ జియో ఫ్రీ ఆయుధాన్ని తట్టుకునేందుకు తమ కస్టమర్లకు ఎయిర్ టెల్ ఓ భారీ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.51 కే వన్ జీబీ 3జీ లేదా 4జీ డేటా ఇస్తామని ప్రకటించింది. ప్రస్తుతం 28 రోజుల వాలిడిటీతో రూ.259కి ఒక జీబీ 4జీ డేటాను ఎయిర్ టెల్ కస్టమర్లకు అందిస్తోంది. రిలయెన్స్ ధాటిని తట్టుకునేందుకు ఇప్పుడీ కొత్త ఆఫర్ తెరమీదకు తెచ్చింది.
అయితే 4జీ డేటాను భారీగా తగ్గించే క్రమంలో కూడా ఎయర్ టెల్ ట్విస్ట్ మొదలుపెట్టింది. ముందుగా రూ.1498 రీచార్జ్ చేసుకున్న వారికి ఈ స్వల్ప నూతన ప్లాన్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. రూ.1498 ప్లాన్ లో 1 జీబీ 3 జీ లేదా 4జీ డేటా 28 రోజుల వరకు ఉచితంగా వస్తుంది. ఆ తర్వాత రూ. 51కే ఒక జీబీ 3జీ లేదా 4జీ డేటా రీచార్జ్ చేసుకోవచ్చు. 12 నెలల వరకు ఎన్నిసార్లయినా రూ.51కే ఒక జీబీ 4జీ డేటా రీచార్జ్ చేసుకోవచ్చని ఎయిర్ టెల్ తెలిపింది. మరో ఆసక్తికరమైన ఆఫర్ ను కూడా ఎయిర్ టెల్ ప్రకటించింది. రూ.748 రీచార్జ్ చేసుకుంటే ఆరు నెలల వరకు ఎన్నిసార్లయినా రూ.99 కే ఒక జీబీ 4జీ డేటా రీచార్జ్ చేసుకోవచ్చు