ప్రముఖ రాజకీయ కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. బిహార్ రాజకీయాల్లో కీలకభూమిక పోషించే ఆర్జేడీ చీఫ్ లాలూ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. లక్షలాది మంది లాలూ అభిమానులు వారింట్లో పెళ్లి ముచ్చట విషయంలో ఆసక్తిగా ఉన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని ఐశ్వర్యరాయ్ తో.. లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ పెళ్లి నిశ్చయమైన ముచ్చట బయటకు వచ్చింది.
ఇంతకీ ఐశ్వర్యరాయ్ ఎవరంటే.. బిహార్ మాజీ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దరోగా ప్రసాద్ రాయ్ మనుమరాలు. ఏప్రిల్ 18న వీరిద్దరి ఎంగేజ్ మెంట్ జరుగుతుందని.. వచ్చే నెలలో పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాల వారు నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. బిహార్ రాజధాని పాట్నాలోని వెటర్నరీ కాలేజీ గ్రౌండ్స్ లో వీరి పెళ్లి వేడుకలు జరుగుతాయని తెలుస్తోంది.
లాలూ కుటుంబం ఎంత పెద్దదో అందరికి తెలిసిందే. మరి.. వారింట్లో కోడలిగా రానున్న ఐశ్వర్య కుటుంబ నేపథ్యంలో చూస్తే.. వీరి కుటుంబం కూడా పెద్దదే అని చెప్పక తప్పదు. ఆమె తాత మాజీ ముఖ్యమంత్రి కాగా.. యాదవ సామాజిక వర్గం నుంచి సీఎంగా పని చేసిన మొదటి నేతగా చెబుతారు. ఇక.. ఐశ్వర్య తండ్రి చంద్రికా రాయ్ బిహార్ రాష్ట్ర మంత్రిగా వ్యవహరించారు.
ఢిల్లీ వర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించిన ఐశ్వర్యకు ఎన్నో సంస్థలు జాబ్స్ ఆఫర్ చేసినప్పటికీ ఆమె రిజెక్ట్ చేసినట్లుగా చెబుతారు. తేజ్ ప్రతాప్ పెళ్లి కోసం రబ్రీదేవి జరిపిన అన్వేషణ పూర్తి అయినట్లుగా చెప్పాలి. తన ఇంటి కోడలి వచ్చే మహిళ ఎలా ఉండాలన్న విషయంపై గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావటం తెలిసిందే. ఏమైనా.. ఇప్పుడు లాలూ ఇంట పెళ్లి సందడి మొదలైందని చెప్పక తప్పదు.