బాలీవుడ్ బడా హీరోల్లో ఒకడైన అజయ్ దేవగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మంగళవారం భేటీ కావడం ఆసక్తి రేపుతోంది. విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో అజయ్.. బాబును కలిశారు. వీళ్లిద్దరి మధ్య చాలా సమయమే భేటీ సాగింది. తాను - తన భార్య కాజోల్ ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తామని అజయ్ దేవగన్ ప్రతిపాదించినట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి చంద్రబాబు సంతోషంగా అంగీకరించినట్లు తెలిసింది.
ఏపీలో ఎంటర్ టైన్ మెంట్ - మీడియా - క్రియేటివ్ ప్రాజెక్టులు చేపట్టుందుకు అజయ్ దేవగన్ ముందుకు వచ్చాడు. దీనికి సంబంధించి అజయ్ తన టీంతో కలిసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చినట్లు తెలిసింది. అత్యాధునిక లైడర్ టెక్నాలజీ సహాయంతో భూఉపరితల ఛాయాచిత్రాలు తీసే ప్రాజెక్టును అజయ్ దేవగన్ బృందం ప్రతిపాదించింది
ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రంలోని ఇరిగేషన్ - కన్ స్ట్రక్షన్ ప్రాజెక్టులను పర్యవేక్షించడానికి ఉపయోగించవచ్చని సీఎం భావిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయడానికి చంద్రబాబు అంగీకరించారు. మరి ముంబయికి చెందిన అజయ్ - కాజోల్ లను ఏపీ బ్రాండ్ అంబాసిడర్లుగానూ నియమిస్తారా అన్నది ఆసక్తికరం. ఇప్పటికే సాయికుమార్ విజయవాడ పోలీసు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.