టీడీపీకి - ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి సపోర్ట్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని మీడియావర్గాలు అహర్నిశలు శ్రమిస్తున్నాయని పలువురు చెబుతుంటారు. చంద్రబాబు ఏం చేసినా పొగడటమే వాటి లక్ష్యమని కూడా అంటుంటారు. ప్రధానంగా రెండు మీడియా సంస్థలపై ఈ మేరకు వేలెత్తి చూపిస్తుంటారు. వాటినే పచ్చ మీడియా అని కూడా అభివర్ణిస్తుంటారు. తనను పదేపదే ఆకాశానికి ఎత్తుతున్నందుకుగాను ఈ పచ్చ మీడియాకు చంద్రబాబు ఎప్పటికప్పుడు భారీగానే లబ్ధి చేకూరుస్తున్నట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది.
చంద్రబాబు సర్కారు తీవ్రస్థాయిలో అవినీతికి పాల్పడుతోందంటూ ఇటీవల విమర్శల గళం పెంచిన మాజీ సీఎస్ అజేయ కల్లాం చెప్పినట్లు ప్రచారంలోకి వచ్చిన వ్యాఖ్యలు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. తనకు నిరంతరం వత్తాసు పలుకుతున్న ఓ తోక పత్రికకు చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లలో వివిధ రూపాల్లో ఏడు వందల కోట్ల రూపాయల వరకు లబ్ధి కలిగించిందని కల్లాం చెప్పారట. ఆ లెక్కలన్నీ చూస్తుంటే తనకే మతిపోతోందని కూడా కల్లాం వ్యాఖ్యానించారట.
కల్లాం చెప్పినట్లు ప్రచారంలోకి వచ్చిన ఆ మాటలు నిజమైతే.. మరి పచ్చ మీడియాలో ప్రధాన పక్షమైన మరో పత్రికకు చంద్రబాబు ప్రభుత్వం ఏ మేరకు ప్రయోజనాలు కలిగించి ఉంటుందోనని పలువురు ప్రస్తుతం ఆశ్చర్యపోతున్నారు. తోక పత్రికకే ఇంతగా లబ్ధి చేకూరిస్తే.. ప్రధాన పత్రికకు అధమ పక్షం రూ.వెయ్యి కోట్లయినా ముట్టజెప్పి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. నిజానికి తోక పత్రిక కంటే ఆ ప్రధాన పత్రికే చంద్రబాబుకు అత్యంత ముఖ్యమైనది కదా అని విశ్లేషిస్తున్నారు. మరి రూ.700 కోట్ల లబ్ధి మాటలు కల్లాం నిజంగానే చెప్పారా? లేక వదంతులేనా? అనే సంగతి ప్రస్తుతానికి నిర్ధారణ కాలేదు. కానీ, ఏళ్లపాటు తన వెన్నంటి ఉండి తాను అధికార పీఠమెక్కడంలో కీలక పాత్ర పోషించిన పచ్చ మీడియాకు చంద్రబాబు ఆ మాత్రం ముట్టజెప్పే ఉంటారులే అని పలువురు విశ్లేషిస్తున్నారు.