ఏపీ సీఎంవో సూపర్ బాస్ పవర్స్ అన్ని పోయినట్లేనట!

Update: 2020-07-09 15:30 GMT
ఉద్యోగం కావొచ్చు మరింకేదైనా కావొచ్చు. పవర్ సెంట్రిక్ గా ఉండే చాలా ప్రాంతాల్లో సూపర్ బాస్ లుగా వ్యవహరించే వారి హవా సాగినంత కాలం తిరుగులేని రీతిలో సాగుతుంటుంది. కానీ.. అంతలోనే గాలి తీసిన బుడగలా మారిపోతుంది. దీంతో అప్పటివరకూ చక్రం తిప్పిన వారంతా చేతులు ముడుచుకొని కూర్చోవాల్సిందే తప్పించి ఇంకేం చేయలేని పరిసర్థితి. ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇటీవల జరుగుతున్న మార్పుల్ని చూస్తే.. ఇదెంత నిజమో ఇట్టే అర్థమైపోతుంది.

సీఎంలో మొన్నటివరకూ తిరుగులేని సూపర్ పవర్ గా వ్యవహరించిన అజేయ్ కల్లం పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిందని చెబుతున్నారు. ఆ మధ్య వరకూ ముఖ్యమంత్రి జగన్ వద్దకు ఏదైనా విషయాన్ని తీసుకెళితే.. కల్లెం అన్నకు చెప్పండన్న మాట సీఎం జగన్ నోట స్వయంగా వచ్చేది. అంతలా వెలిగిపోయిన అజేయ్ కల్లం పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారినట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఆయన అప్రాధాన్యత శాఖలో కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. ఒక్క అజేయ్ కల్లం మాత్రమే కాదు.. మరో సలహాదారు పీవీ రమేశ్ పరిస్థితి కూడా ఇప్పుడు మారిందంటున్నారు.

మొన్నటివరకూ ఏపీ సీఎంవోలో ఒక వెలుగు వెలిగిన వారంతా.. ఇటీవల కాలంలో అందుకు భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎందుకిలా అంటే.. కవరింగ్ మాటలు వినిపిస్తున్నా.. ఇద్దరు కీలక అధికారుల స్థానే ఇటీవల కాలంలో సీనియర్ ఐఏఎస్ అధికారిక ప్రవీణ్ ప్రకాశ్ ఒక వెలుగు వెలిగిపోతున్నట్లు చెబుతున్నారు. మొన్నటి వరకూ కీలక శాఖల్ని పర్యవేక్షించిన వారికి అప్రాధాన్యత శాఖల్ని అప్పగిస్తున్నారు.

ఎప్పుడైతే ప్రవీణ్ ప్రకాష్ ను సీఎంవోలోకి తీసుకున్నారో అప్పటి నుంచి అజేయ్ కల్లం ప్రాధాన్యత తగ్గిపోతోంది. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే.. కల్లం అధికారాలకు పూర్తిస్థాయిలో కత్తెర వేయటం కనిపిస్తోంది. ఇంతకీ ఆయన చేసిన తప్పేమిటన్న ప్రశ్నకు సమాధానం దొరకని పరిస్థితి. ఏమైనా.. మొన్నటివరకూ ఒక వెలుగు వెలిగి.. ఇప్పుడు అందుకు భిన్నంగా ఉండటం అంటే పూలమ్మిన చోట కట్టెలు అమ్మిన వైనానికి దగ్గరగా పరిస్థితులు ఉన్నాయని చెప్పక తప్పదు.
Tags:    

Similar News