మోడీ పవర్లోకి వచ్చాక బాగా సుపరిచితమైన పేర్లలో అజిత్ దోబాల్ ఒకటి. ఇండియన్ జేమ్స్ బాండ్ ఇమేజ్ ఉన్న ఆయనకు కేంద్రంలో కీలక పదవులు కట్టబెట్టటం మోడీకి మామూలే. ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారుగా వ్యవహరిస్తున్న ఆయనకు.. మరో ఐదేళ్ల పాటు ఇదే పదవిలో కొనసాగేలా కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది.
తాజా పోస్టింగ్ లో ఈసారి ఆయనకు కేబినెట్ హోదా కల్పించినట్ఉలగా చెబుతున్నారు. దేశ భద్రతా వ్యవహారాల్లో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా తాజా హోదాను కల్పించినట్లుగా చెబుతున్నారు. మోడీ 2.0లో పూర్తి చేయాల్సిన కీలక అంశాల్లో దోవల్ సహకారం చాలా అవసరం.
ఇలాంటివేళ.. ఆయనకు జాతీయ భద్రతా సలహాదారుగా పదవీ కాలాన్ని ఐదేళ్ల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజ్ నాథ్ నుంచి రక్షణ శాఖ బాధ్యతలు అమిత్ షాకు అప్పజెప్పటంతో దోవల్ మీద కొన్ని వర్గాల మీడియా అనుమానాలు వ్యక్తం చేశాయి. అయితే.. రాజ్ నాథ్ సింగ్ తో పోలిస్తే.. అమిత్ షా రక్షణ శాఖ బాధ్యతలు చేపట్టిన వేళలోనే దోవల్ అవసరం చాలా ఉంది. ఈ వాదనను నిజం చేస్తూ మోడీ తాజాగా తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది.
1968 బ్యాచ్ కు చెందిన ఈ ఐపీఎస్ అధకారి సుదీర్ఘకాలం ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా బాధ్యతలు నిర్వర్తించటం తెలిసిందే. 2016 మెరుపుదాడులు మొదలు ఈ మధ్యనే నిర్వహించిన బాలాకోట్ వైమానిక దాడులు కూడా దోవల్ నేతృత్వంలోనే జరిగాయి. రానున్న ఐదేళ్ల వ్యవధిలో మోడీ సిద్ధం చేసుకున్న బ్లూ ప్రింట్ ను అమలు చేయాల్సిన బాధ్యత దోవల్ మీదనే ఉంది. ఆ విషయం తాజా పోస్టింగ్ తో రుజువైందని చెప్పక తప్పదు.