మూడు దేశాల పర్యటనకు వెళ్లిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ... తన వెంట భారీ సంఖ్యలో అధికార యంత్రాంగాన్ని కూడా తీసుకెళ్లారు. ఈ బృందంలో ఎవరు ఉన్నా, లేకున్నా... కూడా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాత్రం ఉండాల్సిందే. ఎందుకంటే... ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుపుతున్న సమయంలో దోవల్ సలహాలు మోదీకి అత్యంత అవసరం కాబట్టి. ఇండియన్ జేమ్స్ బాండ్ గా పేరుగాంచిన దోవల్... ఐపీఎస్ అధికారి అన్న విషయం తెలిసిందే. ఐపీఎస్ అధికారిగా ఉన్న దోవల్... కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగంలో సుదీర్ఘ కాలం పనిచేశారు. అదే సమయంలో భారత గూఢచారిగా పలు దేశాల్లోనూ ఆయన కాలం గడిపారు. భారత్ కు దాయాది దేశంగా ఉంటూనే నిత్యం భారత్ పై కుట్రలు - కుతంత్రాలకు పాల్పడే పాకిస్థాన్ లోనూ దోవల్ ఏ ఒక్కరికి అనుమానం రాకుండా కొన్నేళ్ల పాటు గూఢచారిగా మకాం వేసిన వైనం కూడా మనకు తెలిసిందే.
ఇక ప్రస్తుత విషయానికి వస్తే... మోదీ అమెరికా పర్యటనలో భాగంగా నిన్న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ సహా భారత బృందం మొత్తం ఓ వైపు కూర్చోగా... ట్రంప్ తో పాటు అమెరికా అధికారుల బృందం టేబుల్ కు మరోవైపున కూర్చుంది. ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరిపే సమయంలో... ట్రంప్ చెబుతున్న విషయాలను మోదీ ఆలకిస్తుండగా... తాను సిద్ధం చేసుకున్న పేపర్లు ఒక్కసారిగా గాలికి ఎగిరిపోయాయట. దీంతో మోదీ వెనకాలే కూర్చున్న దోవల్... క్షణాల్లో లేచి ఆ పేపర్లను ఒడిసిపట్టుకుని మోదీకి అందించారట. దీంతో కాస్త ఊపిరి పీల్చుకున్న మోదీ... ఆ పేపర్లను సర్దుకునేలోగానే మరోమారు గాలి రావడంతో మరోమారు ఆ పేపర్లలోని కొన్ని మళ్లీ లేచిపోయాయట.
అప్పటికే అలర్ట్‌గా ఉన్న దోవల్ మరోమారు తన కుర్చీలోనుంచి లేచి ఆ పేపర్లను ఒడిసిపట్టుకుని మోదీకి అందించారట. దీంతో బాగా వీస్తున్న గాలి కారణంగా తన చేతిలోని పేపర్లు మరోమారు లేచిపోవడం ఖాయమని గమనించిన మోదీ... దోవల్ అందించిన పేపర్లను తన చేతిలోని పేపర్లతో కలిపేసి గట్టిగా పట్టుకున్నారట. అక్కడ యమ అలర్ట్‌గా ఉన్న దోవల్ లేకుంటే మాత్రం మోదీ చేతిలోని పేపర్లు గాల్లోకి ఎగిరిపోయేవని అక్కడి వారు గుసగుసలాడుకున్నారట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/