మహారాష్ట్రలో ఎన్నో ఊహించని మలుపులు తిరిగిన రాజకీయం నేటితో ఒక కొలిక్కి వచ్చింది అని చెప్పవచ్చు. బీజేపీ ప్రభుత్వం మూడు రోజుల ముచ్చటగానే ముగిసిపోవడంతో - శివసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ఎన్నికలలో గెలిచిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ లో ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం బయటికొస్తున్న అజిత్ పవార్ ను మీడియా ప్రతినిధులు కొన్ని ప్రశ్నలు అడిగారు.
అందులో ముఖ్యంగా ‘మీరు ఇప్పటికీ ఎన్సీపీలోనే ఉన్నారా?’ అని అడగ్గా .. అజిత్ పవార్ అసహనం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పాలని, తాను ఇప్పటికే ఎన్సీపీతో ఉన్నానని - ఎన్సీపీతోనే ఉంటానని స్పష్టం చేశానని అజిత్ సమాధానమిచ్చారు. ‘ఎన్సీపీ నుంచి నన్ను బహిష్కరించారా? మీరెక్కడైనా విన్నారా లేక చదివారా? నేను ఎన్సీపీలోనే ఉన్నా?’ అని అజిత్ పవార్ కొంచెం ఘాటుగానే సమాధానమిచ్చారు. ఇకపోతే ఏ పదవి కోసమైతే బీజేపీ లోకి అజిత్ వెళ్లారో ..అదే పదవి మళ్లీ చేపట్టబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కూటమిలో భాగంగా ఎన్సీపీ కి వచ్చే డిప్యూటీ సీఎం పదవిని అజిత్ పవార్ చేపట్టబోతున్నారు అనే వార్తలు ఎక్కువ వినిపిస్తున్నాయి. దీనిపై ఇంకా పూర్తి స్పష్టత అయితే రావాల్సిఉంది.