సుడిగాడంటే అజిత్ పవారేనండి!

Update: 2019-12-30 09:19 GMT
తప్పులు చేసినా.. సరైన సమయంలో దిద్దుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో అందరికి తెలిసేలా చేశాడు అజిత్ పవార్. శివసేన.. ఎన్సీపీ.. కాంగ్రెస్ పార్టీలు కలిసి మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిసైడ్ అవుతున్న వేళ.. బీజేపీ వేసిన ట్రాప్ లోకి చిక్కుకొని..సొంతోళ్లకు షాకిచ్చిన అజిత్ పవార్ కథ ఇంకా అందరికి గుర్తుండే ఉండొచ్చు.

రాజకీయాలు పరమ కిరాతకంగా.. కర్కసంగా ఉంటాయన్న మాటకు నిదర్శనంగా అజిత్ పవాన్ నిలిచారు. అయితే.. కుటుంబ అనుబంధాలు ముందు రాజకీయాలు.. పదవులు ఎంత? అంటూ సెంటిమెంట్ రాగాన్ని ఆలపించి అజిత్ మనసును మార్చేసి కమలనాథులకు దిమ్మ తిరిగేలా షాకిచ్చేలా చేశారు శరద్ పవార్. ఇలా మహారాష్ట్ర రాజకీయాన్ని ఒక కొలిక్కి తీసుకురావటం.. అనుకున్నట్లే శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం తెలిసిందే.  

ఇదిలా ఉంటే.. తొలిదశలో ఎలాంటి పదవి దక్కని అజిత్ పవార్ కు తాజాగా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. తాజాగా ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు అశోక్ చవాన్.. ఎన్సీపీ నేత ధనంజయ్ ముండేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. మహా సీఎంగా ఉద్దవ్ ప్రమాణం చేసిన 32వ రోజున మంత్రివర్గ విస్తరణ చేపట్టటం విశేషం.

తాజాగా చేపట్టిన పదవులతో మహారాష్ట్ర మంత్రివర్గం 36కు చేరుకుంది. అందులో 26 మంది ఎన్సీపీ..శివసేనకు చెందిన వారు ఉండగా.. పది మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఉన్నారు. వెన్నుపోటు పొడిచి అధికారాన్ని సొంతం చేసుకోవాలనుకున్న ప్లాన్ ను అనూహ్యంగా మార్చేసి.. తప్పు చేశానంటూ వెనక్కి వెళ్లి మరీ.. డిప్యూటీ సీఎం పదవిని చేపట్టటం చూస్తే.. అజిత్ పవార్ కు మించిన సుడిగాడు సమకాలీన రాజకీయాల్లో మరొకరు ఉండరని చెప్పక తప్పదు.


Tags:    

Similar News