తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు హాట్‌హాట్ గా సాగాయి. రైతు సమస్యలపై కాంగ్రెస్ పార్టీ చలో అసెంబ్లీ చేపట్టడంపై అనూహ్య రీతిలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘాటుగా స్పందించింది. అయితే అనూహ్య రీతిలో ఈ పార్టీకి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మద్దతు ఇచ్చారు. శాసనసభలో స్పీకర్ పోడియంను చుట్టుముట్టి సభకు అంతరాయం కలిగిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై నిప్పులు చెరిగారు. సభ సజావుగా సాగేందుకు కాంగ్రెస్ సభ్యులు సహకరించాలని కోరారు. ప్రశ్నోత్తరాలకు ఆటంకం కలిగించడం సరికాదన్నారు.
బీఏసీలో నిర్ణయించిన మేరకు సభ్యులంతా సభకు సహకరించాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పారు. సభకు ఆటంకం కలిగినస్తున్న కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని విషయాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పినప్పటికీ... ఆందోళన చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. రైతుల సమస్యల విషయంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేందుకు సభను స్తంభించడం సరికాదని ఓవైసీ వివరించారు.
మరోవైపు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన కాంగ్రెస్ నేతలపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉంటే.. కాంగ్రెస్ నేతలు మాత్రం రచ్చకు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ సభ్యులు 20 రోజులు సభ నడపాలన్నారు...కానీ ప్రభుత్వం 50 రోజులు సభ నడపాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ సభ్యులు కోరితే సమావేశాలు ఇంకా పొడిగిస్తామని చెప్పారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. శీతకాల సమావేశాలను పూర్తిగా వినియోగించుకుంటామన్నారు. ఎన్ని రోజులైనా సభ నడిపేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.