అక్బ‌రుద్దీన్ ఈ విషం క‌క్క‌టం ఆప‌వా?

Update: 2017-07-03 19:30 GMT
చేసేది మ‌త రాజ‌కీయం. దాన్ని స‌మ‌ర్థించేందుకు అడ్డ‌గోలుగా మాట్లాడ‌టం మ‌జ్లిస్ నేత‌ల‌కు మామూలే. తొండి వాద‌న‌లు వినిపించ‌టం.. ఉద్రిక్త‌త‌లు పెంచేలా వ్యాఖ్య‌లు చేయ‌టం.. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో చ‌ట్టాన్ని అతిక్ర‌మించేలా ప్ర‌సంగాలు చేయ‌టం.. రెచ్చిపోయేలా మాట్లాడ‌టం మ‌జ్లిస్ నేత‌ల‌కు అల‌వాటే. త‌మ‌ నోటికి.. చేతికి ప‌ని చెప్ప‌టం ద్వారా కేసుల్లో చిక్కుకొని..  జైళ్ల‌కు సైతం వెళ్లిన ఘ‌న చ‌రిత్ర మ‌జ్లిస్ నేత‌ల సొంతం.

వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో ఉద్రిక్త‌త‌లు పెంచ‌టం.. వంటి దుర్మార్గానికి పాల్ప‌డ‌తార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొనే మ‌జ్లిస్ ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ తాజాగా మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్ లోని ఒక బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడిన ఆయ‌న.. కేంద్ర‌.. రాష్ట్ర ప్ర‌భుత్వాలు ముస్లింల‌కు అన్యాయం చేస్తున్నాయ‌ని వ్యాఖ్యానించారు.

ముస్లింల‌కు ప్ర‌త్యేక నియోజ‌క‌వ‌ర్గాలు కేటాయిస్తే న్యాయం జ‌రుగుతుంద‌న్న ఆయ‌న‌.. భిన్న‌త్వంలో ఏక‌త్వం ప్రాతిప‌దిక‌గా ఉన్న దేశంలో హిందువుల‌కు ఎంత హ‌క్కు ఉందో.. ముస్లింల‌కు అంతే హ‌క్కు ఉందంటూ మాట్లాడారు. ఇదే విష‌యాన్ని పాత‌బ‌స్తీకి అప్లై చేసి.. హిందువుల‌కు కొన్ని నియోజ‌క‌వ‌ర్గాలు కేటాయించాల‌న్న డిమాండ్ అక్బ‌రుద్దీన్ నోటి నుంచి రాగ‌ల‌దా? అని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. అయినా.. ఈ త‌ర‌హా వాద‌నను ప్రాథ‌మికంగా తిర‌స్క‌రించాల్సిన అవ‌స‌రం ఉంది.

మ‌తాల వారీగా.. కులాల వారీగా నియోజ‌క‌వ‌ర్గాలు చీల్చుకుంటూ వెళితే.. దేశం ఏమైపోవాల‌న్న క‌నీస స్పృహ కూడా లేకుండా మాట్లాడుతున్న అక్బ‌ర్ మాట‌లు  ఇంత‌టితో ఆగ‌లేదు.  దేశంలో ముస్లింలు ఐక్యం కాక‌పోవ‌ట‌మే అన్నింటికి మూల‌మ‌న్న ఆయ‌న‌.. చ‌ట్ట‌స‌భ‌ల్లో ముస్లింల‌కు వ్య‌తిరేకంగా చ‌ట్టాలు చేస్తున్నారంటూ ఆరోపించారు.

ఇప్ప‌టికి ముస్లింలు తేరుకోక‌పోతే తీవ్ర న‌ష్టం త‌ప్ప‌ద‌న్న ఆయ‌న‌.. ముస్లింలు త‌లుచుకుంటే మార్పు సాధ్య‌మ‌న్నారు. కేవ‌లం ముస్లిం ఓట్ల‌తోనే 50 పార్ల‌మెంటు స్థానాలు సాధించే వీలుంద‌ని అక్బ‌రుద్దీన్ వ్యాఖ్యానించారు.  అక్బ‌రుద్దీన్ మాట‌లు విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్న వేళ‌.. ఆయ‌న సోద‌రుడు క‌మ్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ స్పందించారు. అక్బ‌రుద్దీన్ మాట‌ల్లో త‌ప్పు ఏముందంటూ ప్ర‌శ్నించారు. నిజ‌మే.. త‌మ్ముడి మాటల్లో త‌ప్పు ఉంద‌ని ఒప్పుకుంటే.. అసదుద్దీన్ కాకుండా పోతారుగా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News