రైతుల క‌న్నా...రాక్ష‌సులు మిన్న‌

Update: 2015-09-29 07:06 GMT
కొన్ని డిమాండ్లు చాల చిత్రంగా ఉంటాయి అనే కంటే చెత్త‌గా ఉంటాయి అన‌డం క‌రెక్టు. ఒక‌ప‌క్క స‌మాజాన్ని ప‌ట్టిపీడిస్తున్న స‌మ‌స్య గురించి అంతా ఆవేద‌న చెందుతుంటే...అవ‌న్నీ ప‌క్క‌న‌పెట్టండి మా ఓటు బ్యాంకు రాజ‌కీయాల గురించి....మ‌నంద‌రికీ ద‌రిద్రంగా మారిన రాక్ష‌సుల గురించి కీర్తించండి అంటే ఎలా ఉంటుంది?  లాగి.... కొట్టాల‌నిపిస్తుంది క‌దా? ఇలాంటి ప‌రిస్థితే తెలంగాణ అసెంబ్లీలో ఎదురైంది మ‌రి.

తెలంగాణ శాసనసభ సమావేశాల ప్రారంభం అనంతరం రైతు సమస్యలపై చర్చను చేపట్టేందుకు స్పీకర్ మ‌ధుసూధ‌నాచారి అనుమతి తెలిపారు. అయితే ఎంఐఎం శాసనసభ్యుడు, ఆ పార్టీ ప‌క్ష‌నేత‌ అక్బరుద్దీన్ ఓవైసీ కొత్త డిమాండ్ చేశారు. న‌ల్ల‌గొండ జిల్లాలో జ‌రిగిన వికారుద్దీన్ ఎన్‌ కౌంటర్‌ పై చర్చించాలని పట్టుబట్టారు. ఆ త‌ర్వాతే రైతుల‌పై మాట్లాడుదామ‌ని మొండిప‌ట్టుప‌ట్టారు. దీనిపై స్పందించిన సభాపతి మధుసూదనాచారి మాట్లాడుతూ... రెండు రోజులపాటు రైతు ఆత్మహత్యలపై చర్చించుకుందామని బీఏసీలో నిర్ణయించుకున్నామ‌ని, దీనికి అన్ని పక్షాలు సమ్మతి తెలిపాయని గుర్తుచేశారు. ఇందుకు అనుగుణంగానే ఇవాళ అంతా రైతు సమస్యలపైనే చర్చ జరగనుందని, ఇతర అంశాలు ఏమైనా తర్వాత మాట్లాడుకుందామ‌ని చెప్పారు. రైతు సమస్యలపై మాట్లాడాలని ప్రశ్నోత్తరాలనూ రద్దు చేసుకున్నామని ఆయన గుర్తుచేశారు.

బీఏసీలో ఎంఐఎం ఫ్లోర్‌ లీడ‌ర్‌ గా స‌భ సాగే విధానంపై ఓకే చేసి అసెంబ్లీ లోప‌లికి వ‌చ్చిన త‌ర్వాత కొ(చె)త్త  డిమాండ్ చేయ‌డం ఆ పార్టీకే చెల్లింది. పైగా ఆయ‌నేమైనా జాతికోసం ప్రాణత్యాగం చేసిన వాడా?  అరాచ‌కంగా జ‌నాల‌ను పొట్ట‌న‌పెట్టుకున్న రాక్ష‌సుడు. వాడితో సహా మరణించిన వారిదీ అదే కేటగిరీ. అలాంటి వారికోసం స‌మాజానికి ప‌ట్టెడ‌న్నం పెడుతూ.... ఆ క్ర‌మంలో త‌నువు చాలిస్తున్న అన్న‌దాత‌ల గురించి స‌భ మొత్తం చేసే చ‌ర్చ‌ను ప‌క్క‌న‌పెట్టాల‌ని కోర‌డం మూర్ఖ‌త్వం కాక‌పోతే మ‌రేంటి? త‌్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో ఓట్ల‌కోస‌మే ఇదంతా అనేది అంద‌రికీ తెలిసిందే. అయినా ఏ వ‌ర్గ‌మైన తినేది అన్న‌మే. అది పెట్టే రైత‌న్నకు మేలు చేసే చ‌ర్చ‌ను కాద‌న్న‌వారికి ఓట్లు వేసే వారిని ఏమ‌నాలి?
Tags:    

Similar News