అక్బరుద్దీన్ ను ఎలా చంపాలని ప్లాన్ చేశారంటే..

Update: 2016-09-07 05:13 GMT
ఇది మా రాజ్యం.. ఇక్కడ మీకేం పని అని చెప్పుకోగలిగిన నేతలు రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి కొద్దిమందే ఉన్నారు. అలాంటి నేతల్లో ఓవైసీ సోదరులు ముందుంటారు. వారిని అభిమానించే వారు ఎంతమందో.. వారిని ద్వేషించే వారి సంఖ్యా ఎక్కువే. ఐదేళ్ల కిందట ఓవైసీ సోదరుల్లో చిన్నవాడైన అక్బరుద్దీన్ పై ఊహించని దాడి జరిగింది. ఈ దాడి ఎంత తీవ్రమైనదన్న విషయం తాజాగా అక్బరుద్దీన్ మాటల్లో ఇట్టే తెలుస్తుంది.  రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ ఉదంతానికి సంబంధించిన కేసు తాజాగా నాంపల్లి ఏడో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో నమోదు చేశారు. ఈ కేసు విచారణకు మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ హాజరయి.. తనపై జరిగిన దాడిని కళ్లకు కట్టినట్లు వివరించారు.

ఓపక్క అక్బరుద్దీన్.. మరోవైపు ఆయనపై అటాక్ చేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్న పహిల్వాన్ వర్గానికి చెందిన వారు పెద్ద ఎత్తున నాంపల్లి కోర్టు ఆవరణకు చేరుకున్నారు. ఇరు వర్గాలకు సంబంధించిన వారితో కోర్టు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కోర్టు హాలు వద్దకు అనుమతిని నిరాకరించారు. తొలుత మీడియాకు సైతం నో చెప్పిన అధికారులు.. అనంతరం మీడియా ఎంట్రీకి ఓకే అనేశారు.

దాదాపు ఐదేళ్ల కిందట (2011 ఏప్రిల్ 30న) తనపై జరిగిన అటాక్ గురించి అక్బరుద్దీన్ కోర్టుకు తెలియజేశారు. తనపై దాడి జరిగిన రోజున తాను ఉదయం 8.15 గంటల సమయంలో  బంజారాహిల్స్ నుంచి జిప్సీలో పాతబస్తీలోని బార్కాస్ కు బయలుదేరా. పలు ప్రాంతాల్లోపర్యటించిన తర్వాత ఉదయం 11 గంటల వేళ బార్కాస్ లోని మజ్లిస్ ఆఫీసులో విశ్రాంతి తీసుకున్నాం. ఉదయం 11 గంటల సమయంలో దారుస్సలాంలోని పార్టీ కార్యాలయానికి బయలుదేరాం.

ఆ సమయంలో నా వాహనం ముందు యాక్టివా వాహనాన్ని పడేయటంతో నేను ప్రయాణిస్తున్న వాహనాన్ని నిలిపేశాం. యాక్టివా మీద నుంచి నా మీదకు వచ్చిన హసన్ అనే వ్యక్తి కత్తితో నా ఎడమ చేతితో పాటు అనేక ప్రాంతాల్లో పొడిచేశాడు. అబ్దుల్లా బిన్ యానుస్ నా మీద తుపాకీతో కాల్పులు జరిపాడు. పహిల్వాన్ బంధువు.. పహిల్వాన్ కూడా రివాల్వర్ తో కాల్పులు జరిపాడు. తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నా మరో ఐదుగురు నా చుట్టూ చేరి కత్తులతో పొడిచాడు. అవద్ బిన్ యూనస్ నా మీద క్రికెట్ బ్యాట్ తో దాడి చేశారు. ఆ సమయంలో నా దగ్గర ఉన్నా పిస్టల్ ఉన్నా దాడి చేయలేకపోయా. ఈ సందర్భంగా తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటికి తొడలో బుల్లెట్ ఉండిపోయింది. ఈ దాడి కారణంగా ఏడమ చేయి పూర్తిగా దెబ్బతిందని పేర్కొన్నారు.
Tags:    

Similar News