నల్లధన నిర్మూలనకంటూ ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన డీమోనిటైజేషన్ నేపథ్యంలో ఎంఐఎం పార్టీ ముఖ్య నేత - ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఈరోజు తెలంగాణ అసెంబ్లీ తొలిరోజున తనదైన శైలితో సునిశితంగా మాట్లాడారు. అంతా నల్లధనం నల్లధనం అంటున్నారు మరి రాజకీయ పార్టీల వద్ద ఉన్న నల్లధనం సంగతేంటని ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో మాట్లాడిన అక్బర్... నల్లధనాన్ని నిర్మూలించాలంటే తొలుత రాజకీయ పార్టీలు తమ విధానాలను మార్చుకోవాలన్నారు.
ప్రధాన రాజకీయ పార్టీలకువేల కోట్ల రూపాయల విరాళాలు అజ్ఞాత వ్యక్తుల నుంచి అందుతున్నాయని అదంతా బ్లాక్ మనీ కాదా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ - బీజేపీలకు 5వేల400 కోట్ల రూపాయలు అజ్ఞాత వ్యక్తులు - సంస్థల ద్వారా ఫండ్ అందిందని ఆయన తెలిపారు. కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా ఏకంగా 471కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ రూపంలో వచ్చాయన్నారు. మాయవతి పార్టీకి రూ. 448 కోట్లు వచ్చాయన్నారు. ఇలా రాజకీయ పార్టీలే నల్లధనాన్ని విరాళంగా తీసుకుంటున్న తరుణంలో అవినీతి నిర్మూలన ఎలా సాధ్యమని ఓవైసీ ప్రశ్నించారు.
ఇకపై ఏ రాజకీయ పార్టీ కూడా ఇలా విరాళాలు తీసుకోకుండా చట్టం తేవాలని డిమాండ్ చేశారు. రద్దయిన పెద్దనోట్లు మొత్తం తిరిగి బ్యాంకులకు వచ్చేస్తున్నాయని.. అలాంటప్పుడు నల్లధనం అంతా ఏమైందని ఆయన ప్రశ్నించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/