సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీకి, మంత్రి అఖిల ప్రియకు షాక్ తగిలింది. కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఒక పెద్ద కుదుపు వచ్చింది. ప్రధానంగా అఖిల ప్రియ పోటీచేస్తున్న ఆళ్లగడ్డతోపాటు నంద్యాలలో బలంగా ప్రభావితం చేసే గంగుల ప్రతాపరెడ్డి ఫ్యామిలీ ఎన్నికల వేళ యూటర్న్ తీసుకుంది. టీడీపీని కాదని.. వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం సంచలనంగా మారింది. టీడీపీలో ఇన్నాళ్లు కొనసాగుతున్న గంగుల ప్రతాప రెడ్డి అనూహ్యంగా తన మద్దతు దారులతో సమావేశమై ఆళ్లగడ్డలో వైసీపీకి మద్దతు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. కర్నూలు జిల్లాలో దీని ప్రభావం అఖిల ప్రియపై భారీగా పడుతోంది.
కర్నూలు రాజకీయాల్లో దిగ్గజ నేతగా ఉన్న గంగుల ప్రతాపరెడ్డి నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా టీడీపీలో చేరారు. దీంతో అఖిలప్రియ విజయంపై ధీమాగా ఉన్నారు. కానీ మంగళవారం ప్రతాప్ రెడ్డి ఆళ్లగడ్డలో వైసీపీ అభ్యర్థి గంగుల బిజేంద్ర రెడ్డి, కుటుంబ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ కులవ్యక్తి అయిన గంగుల బిజేంద్ర రెడ్డిని గెలిపించేందుకు కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు. గంగుల కుటుంబమంతా ఏకం కావడంతో జిల్లాలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది.
నంద్యాల ఉప ఎన్నికల్లో సీఎం చంద్రబాబు కోరిక మేరకు టీడీపీ కోసం.. అఖిలప్రియ గెలుపుకోసం పనిచేసేందుకు గంగుల ప్రతాప రెడ్డి ఒప్పుకున్నారు. ఆ సమయంలో నంద్యాల ఎంపీ సీటును ఇస్తానని గంగులకు బాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికల వేల గంగులను పక్కన పెట్టి వేరే అభ్యర్థిని ఎంపిక చేశారు. దీంతో మనస్తాపం చెందిన గంగుల ప్రతాప రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ అభ్యర్థికి మద్దతు పలికారు. ప్రతాపరెడ్డి మద్దతుతో కర్నూలు జిల్లా రాజకీయాలు వేగంగా మారాయి. నంద్యాల పార్లమెంట్ పరిధిలోని నియోకవర్గాల్లో ఎంతో ప్రభావితం చేయగల వ్యక్తి ప్రతాప్ రెడ్డి.
నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా గంగుల ప్రతాప్ రెడ్డి వైసీపీలో చేరడం. ఆయన కుమారుడు బిజేంద్రరెడ్డిని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పుడు తమకు ఇచ్చిన మాటను చంద్రబాబు పాటించకపోవడంతో గంగుల ప్రతాప్ రెడ్డి వైసీపీకి మద్దతు ప్రకటించారు. గంగుల ఫ్యామిలీ ఏకమవడం.. వైసీపీకి మద్దతు ఇవ్వడంతో ఈ ప్రభావం అఖిల ప్రియ ఓటమికి దారితీస్తుందని టీడీపీలో ఆందోళన వ్యక్తమవుతోంది.