కేటీఆర్ కు అఖిలప్రియ ప్రత్యేక ఆహ్వానం

Update: 2018-08-09 06:54 GMT
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ, తనకు కాబోయే భర్త భార్గవ్ రామ్ తో కలిసి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ను తమ పెళ్లికి రావాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానించారు. అఖిల ప్రియ-భార్గవ్ ల పెళ్లి ఆగస్టు 29న అఖిల ప్రియ సొంతూళ్లో అంగరంగ వైభవంగా జరగనుంది.

 సీఎం చంద్రబాబు కేబినెట్ లో అఖిల ప్రియ అందరికంటే చిన్న వయస్కురాలు.. మంత్రిగా పెళ్లి చేసుకోబోతున్న అరుదైన సందర్భం ఇది. అందుకే ఈ పెళ్లికి ఏపీ, తెలంగాణ నేతలందరినీ ఆహ్వానిస్తోంది.. హైదరాబాద్ కు చెందిన యువ పారిశ్రామికవేత్త భార్గర్ రామ్ ను ఈ సందర్భంగా కేటీఆర్ కు పరిచయం చేసింది. వీరి పరిశ్రమలు, బ్యాక్ గ్రౌండ్ ను వివరించింది. అఖిల-భార్గవ్ లకు  గత మే నెలలో నిశ్చితార్థం జరిగింది.

ఈ సందర్భంగా కేటీఆర్ కూడా వీరిద్దరిని ఓ సామాజిక కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందిగా కోరినట్టు తెలిసింది.  హైదరాబాద్ లోని ఎన్-కన్వేన్షన్ సెంటర్ లో సెప్టెంబర్ 1 న నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ నేతలు, బిజినెస్ , ఇతర ప్రముఖులకు ఆహ్వానాలు పంపినట్టు తెలిసింది. బహుశా హరితహారం కానీ ఏదైనా సామాజిక సేవ కార్యక్రమానికి గానీ కేటీఆర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అయితే పూర్తి వివరాలు మాత్రం తెలియరాలేదు.
Tags:    

Similar News