ఒకే వేదికపై అఖిలేశ్, రాహుల్

Update: 2017-01-29 07:34 GMT
ఒకరేమో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు.. తల్లి చాటు నుంచి తప్పుకొని నేడోరేపో అధ్యక్ష పీఠం ఎక్కాల్సిన వ్యక్తి. ఇంకొకరు తండ్రితో కొట్లాడి మరీ పార్టీలో కింగ్ గా మారిన సమాజ్ వాది పార్టీ నేత - యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్. ఈ ఇద్దరు యువనేతలు ఒకే వేదికపై ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు.   యూపీ ఎన్నికలో సమాజ్‌ వాదీ పార్టీ - కాంగ్రెస్ కలిసి పోటీచేస్తున్న నేపథ్యంలో ఈ కాంబినేషన్ కుదిరింది.
    
ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో మధ్యాహ్నం ఇద్దరు అధినేతలు ఒకే వేదిక నుంచి ప్రసంగిస్తారు.  మతతత్వ పార్టీలను ఓడించాలని రెండు పార్టీల కార్యకర్తలకు మార్గదర్శకం చేయనున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ తో ప్రచారం మొదలు పెట్టారు. పోస్టర్లపై సిఎం అఖిలేశ్ యాదవ్ - కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బొమ్మలు వేశారు.
    
హజ్రత్‌ గంజ్ ప్రాంతంలోని గాంధీ విగ్రహం నుంచి ఎన్నికల ర్యాలీ ప్రారంభమవుతుంది. తొలుత  లక్నోలో ఇరువురు నేతలూ సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నారు. ఆ తరువాత రోడ్ షో మొదలవుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News