జిమ్మిక్కులు చేయటం.. అవసరానాకి అనుగుణంగా తమను తాము మార్చుకోవటంలో రాజకీయ నాయకులకు మించిన వారు ఉండనే ఉండరు. పరపతి విషయంలో కాస్తంత తేడా వచ్చేసిందంటే చాలు.. జనాల్ని ఆకర్షించేందుకు సరికొత్త ప్రయోగాలు చేస్తుండటం మామూలే. తాజాగా అలాంటి జాబితాలోకి ఎక్కేశారు యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆయనపైనా.. ఆయన పని తీరు మీదా చాలానే అంచనాలు వినిపించాయి. యువకుడైన అఖిలేష్ నుంచి పలు అంశాల్లో మార్పు పక్కా అని భావించినోళ్లు చాలామందే ఉన్నారు. శాంతిభద్రతల విషయంలో కానీ.. అభివృద్ధిలోనూ అఖిలేష్ నాయకత్వంలో దూసుకెళుతుందని అంచనా వేశారు.
అయితే.. అందుకు భిన్నంగా ఏ అంశంలోనూ ఆయన తనదైన ముద్ర వేయలేదన్న విమర్శను మూటగట్టుకున్నారు. అత్యాచారాల రాష్ట్రంగా యూపీ నిందల్ని మూటగట్టుకుంది. అందుకు తగ్గట్లే యూపీలో చాలానే అత్యాచారాలు జరిగాయి. అటు పాలన పరంగా ఎలాంటి ముద్ర వేయలేని అఖిలేష్ ఇప్పుడు అందుకుభిన్నంగా వ్యవహరించి మళ్లీ వార్తల్లోకి వచ్చారు.
పేరుకు సీఎం అయినా తాను సామాన్యుడినేని చేతల్లో చేసి చూపించారు.యూపీ రాజధాని లక్నోలో సామాన్యడి మాదిరి సైకిల్ తొక్కేసి అక్కడి ప్రజల మనసుల్ని దోచుకున్నారు. పేరుకు సీఎం అయినా ఎంత సామాన్యంగా ఉన్నాడన్న భావన కలిగించే ఈ ప్రయత్నంలో భాగంగా.. సీఎం వెనుకాల ఉండే సెక్యూరిటీ వ్యాన్ కూడా లేకుండా వీధుల్లోకి వచ్చేసిన ఆయన్ను చూసిన లక్నో వాసులు.. తాము చూస్తున్నది నిజమేనా? అన్న సందేహాన్ని వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు.
మొత్తానికి పాలనలో తడబడుతున్న అడుగులతో విమర్శలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి అఖిలేష్.. తాజాగా సైకిల్ తొక్కిన ఘటన మాత్రం పలువురిని ఆకర్షించటమేకాదు. ముఖ్య.మంత్రి తీరును తెగ ప్రశంసించేస్తున్నారు.