ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలని మళ్లీ గుర్తుకొచ్చిందే

Update: 2015-06-24 04:15 GMT
ఎన్నికల వేళ ఇచ్చే హామీలు.. ఎన్నికల పూర్తి అయిన తర్వాత గుర్తుండటం కాస్త కష్టమైన విషయమే. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత.. అధికారం వచ్చిన బిజీలో హామీల సంగతిని పెద్దగా పట్టించుకోకుండా పాలకపక్షం పాలనలో బిజీ..బిజీగా ఉంటుంది.

అయితే.. యూపీలో విజయఢంకా మోగించి.. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న అఖిలేష్‌ యాదవ్‌.. తన ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ఒక సంవత్సరం బాగా గుర్తుంచుకున్నారు. టెన్త్‌.. ఇంటర్‌ పరీక్షల్లో మంచి మార్కులు వచ్చిన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు.. ట్యాబ్‌లు ఇస్తామని ఊరించారు.

ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత.. అధికారం చేతికి వచ్చినాక కూడా ఆయన ల్యాప్‌టాప్‌ల హామీని గుర్తుంచుకొని మరీ పంపిణీ చేశారు. తర్వాత సంవత్సరం నుంచి ఆ హామీని మర్చిపోయారు. మళ్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఇచ్చిన హామీ గుర్తుకు వచ్చింది.

అంతే.. ఈ ఏడాది మంచి మార్కులతో పాస్‌ అయిన టెన్త్‌ (19,800).. ఇంటర్‌ (19,800)లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇవ్వనున్నట్లు పేర్కొంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

పరీక్షలు రాసింది స్టేట్‌ సిలబస్సా..సెంట్రల్‌ సిలబస్సా అన్నది పెద్ద విషయం కాదని.. మార్కులు మాత్రమే ప్రామాణికం అని పేర్కొన్న యూపీ సర్కారు వారికి ల్యాపీలు అందించేంఉదకు రెఢీ అవుతోంది. ఎన్నికలు రావటానికి మరో రెండేళ్ల ముందే అఖిలేష్‌ మేలుకోవటం గమనార్హం.

Tags:    

Similar News