2014 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ విజయంలో ప్రశాంత్ కిశోర్ అనే వ్యూహకర్త కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసినప్పటి నుంచి రాజకీయ పార్టీలన్నీ వ్యూహకర్తల వెంట పడుతున్నాయి. ముఖ్యంగా దేశంలో ప్రశాంత్ కిశోర్ ను మించిన సక్సెస్ ఫుల్ వ్యూహకర్త లేడని స్థిరపడిపోయింది. ఇంతవరకు వచ్చిన ఫలితాలు కూడా అదే నిజమని నిరూపించాయి. 2014 ఎన్నికల్లో మోడీ.. ప్రశాంత్ కిశోర్ ప్లానింగ్ తో సూపర్ సక్సెస్ సాధించగా అదే ప్రశాంత్ కిశోర్ ను బీహార్ ఎన్నికల్లో మోడీ బద్ధ శత్రువు నితీశ్ కుమార్ వాడుకున్నారు. అక్కడా ప్రశాంత్ ప్లానింగ్ బ్రహ్మాండంగా వర్కవుట్ అయింది. దీంతో ప్రశాంత్ కిశోర్ కు ఫుల్లు డిమాండు ఉందిప్పుడు. దీంతో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లోనూ పార్టీలు ఆయన కోసం ట్రై చేశాయి. ఆ రేసులో కాంగ్రెస్ ముందు నిలిచి ఇప్పటికే ప్రశాంత్ తో ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాదు... ఏపీలో వైసీపీ అధినేత జగన్ కూడా వచ్చే ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ సేవలను వినియోగించుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు. ఇలా దేశంలో పార్టీలన్నీ ప్రశాంత్ వెంటపడుతుంటే సైకిల్ గుర్తు పార్టీ మాత్రం ప్రశాంత్ రేంజిని దాటేసి ఏకంగా ఇంటర్నేషనల్ వ్యూహకర్తలను ఇండియన్ ఎన్నికల రంగంలోకి దించడానికి రెడీ అవుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొదట్లో దూసుకువెళ్లిన డొనాల్డ్ ట్రంప్ గ్రాఫ్ కిందకు లాగేసి హిల్లరీ క్లింటన్ ను అధ్యక్ష స్థానానికి చేరువ చేస్తూ వ్యూహాలు రచిస్తున్న ఆమె వ్యూహకర్త స్టీవ్ జార్జింగ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో అమెరికన్ మాస్టర్ మైండ్లు మన దేశంలోని ఎన్నికల్లో పనిచేయనున్నాయన్నమాట. అయితే.. ఈ సైకిల్ పార్టీ అంటే చంద్రబాబు పార్టీ తెలుగు దేశం మాత్రం కాదు.. అదే గుర్తు ఉన్న యూపీలో సమాజ్ వాది పార్టీ.
అవును.. వచ్చే ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్ కిశోర్ ను రంగంలోకి దింపుతుండడంతో ఆయన బుర్రను తలదన్నేలా ఇంటర్నేషనల్ వ్యూహకర్తలను దించుతున్నారు ఆ పార్టీ నేత - యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్. ప్రస్తుతం హిల్లరీ క్లింటన్ కు ప్రచారంలో సహకరిస్తూ, రాజకీయ వ్యూహాలను పన్నుతున్న హార్వార్డ్ యూనివర్శిటీ పొలిటికల్ కన్సల్టెంట్ స్టీవ్ జార్డింగ్ తో అఖిలేశ్ డీల్ కుదుర్చుకున్నారు. ప్రచారం జరుగుతున్న తీరును పరిశీలించేందుకు లక్నో వచ్చిన ఆయన ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీకి పలు సలహాలు - సూచనలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.
అమెరికాలో ఎన్నికలు ముగియగానే - తన టీమ్ సహా ఇండియాకు వచ్చే స్టీవ్ - ఇక్కడే మకాం వేసి ప్రచార బాధ్యతలు స్వయంగా పర్యవేక్షించనున్నారు. ఆయన నవంబర్ నుంచి ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగుతారని తెలుస్తోంది. హార్వార్డ్ స్కూల్ లో పబ్లిక్ పాలసీని బోధించే స్టీవ్ జార్డింగ్ - 1980 నుంచి ప్రచారకర్తగా - మేనేజర్ గా - పొలిటికల్ కన్సల్టెంట్ గా, వ్యూహకర్తగా పలువురికి సేవలందించారు. ఆయన క్లయింట్ల జాబితాలో స్పెయిన్ ప్రధాని మరియానో రజోయ్, అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు అల్ గోరె - హిల్లరీ క్లింటన్ వంటి వారెందరో ఉన్నారు. మరి ప్రతి విషయంలో ఇంటర్నేషనల్ రేంజిలో ఆలోచించే మన సైకిల్ పార్టీ అధినేత ఈ ఇంటర్నేషనల్ వ్యూహకర్తను గుర్తించారో లేదో.. గుర్తిస్తే ఆయన కూడా స్టీవ్ సేవలు వినియోగించుకునే ఛాన్సుంది. లేదంటే అసలు స్టీవ్ ను అంతర్జాతీయ స్థాయి వ్యూహకర్తను చేసింది తానేనని.. తనకు ఆయన అవసరమేంటని అంటారో మరి.