అఖిలేశా.. చేతకాక జ్యోతిష్కుడిని నమ్ముతావా.?

Update: 2020-03-17 02:30 GMT
రాజకీయాలకు స్వామిజీలు, మఠాలకు అవినాభావ సంబంధం ఉంది. పరస్పరం సహకరించుకుంటూ వాళ్లు కొనసాగుతుంటారు. రాజకీయ నాయకులు ఈవీఎంలను నమ్మరు కానీ స్వామిజీలను నమ్ముతారు. అందుకే దేశంలో స్వామిజీలు, మఠాలు పెరుగుతున్నారు.. వారు కోటీశ్వర్లు అవుతున్నారు. రాజకీయాలను ప్రభావితం చేసేలా స్వాముజీలు ఉన్నారు. కర్నాటక, ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి మఠ రాజకీయాలు తీవ్రంగా ఉంటాయి. దేశంలోనే అతిపెద్దయిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మఠాలు, స్వామిజీలు ఎక్కువ. ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని పాలించేదే ఓ సన్యాసి.. మఠాధిపతి అనేది తెలిసిందే. తాజాగా ఆయన ప్రత్యర్థి, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కూడా వాటిని నమ్ముతున్నారంట. ఇటీవల ఆయన విమానంలో ప్రయాణిస్తుండగా ఓ సాధువు తన చేతిరేఖలు చూసి త్వరలోనే తాను ముఖ్యమంత్రిని అవుతున్నట్లు తెలిపారని చెప్పారు.

ఇటీవల నేను విమానంలో వెళ్తుండగా ఓ జ్యోతిష్కుడు నా చేయి పట్టుకుని హస్త రేఖలు చూసి 350 సీట్లు తమ పార్టీ సొంతం చేసుకుని తాను మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని చెప్పారని ఇటీవల మీడియాతో సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యనించాడు. తామే ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందని తెలిపాడని వివరించారు. ఆయన చెప్పినట్టే తాము కష్టపడి 2022లో ఉత్తరప్రదేశ్ లో అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా కష్టపడుతున్నట్లు తెలిపారు. జ్యోతిష్కుడు చెప్పిన దానిక కన్నా 351 సీట్లు గెలుచుకుని సత్తా చాటుతామని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను పరిశీలిస్తుంటే అఖిలేశ్ కు ఎంత దుస్థితి ఎదురైందని పేర్కొంటున్నారు. తండ్రి ములాయం సింగ్ యాదవ్ కష్టపడి అధికారం తెచ్చిపెట్టి ఇస్తే ముఖ్యమంత్రి పీఠం కూర్చున్న అఖిలేశ్ యాదవ్ ఆ తర్వాత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి ఆ పదవిని కాపాడుకోలేకపోయిన అసమర్థ నేతగా ఉత్తరప్రదేశ్ లో పేరు ఉంది. అనంతరం మారిన రాజకీయాల నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీలో చిచ్చు రేపాడు. సేమ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన వెన్నుపోటు రాజకీయాలకు అఖిలేశ్ యాదవ్ పాల్పడ్డాడని, తండ్రి చేతిలో ఉన్న పార్టీలో చీలికలు తెచ్చి చివరకు పార్టీని తన చేతిలోకి తీసుకొచ్చి ఇప్పుడు విలువ లేని నాయకుడిగా మారాడని దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు.

ప్రత్యర్థులకు దీటుగా పోరాడి.. పార్టీని పటిష్టం చేయాల్సిన నాయకుడు జ్యోతిష్కుడు చెప్పాడని.. తాము అధికారంలోకి వస్తామని చెప్పడంతో ఇక వచ్చేస్తామనే భ్రమలో ఉండడం సరికాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జ్యోతిష్కుడు చెప్పినంత మాత్రాన కష్టపడి పని చేయకపోతే అధికారం సొంతం చేసుకోవడం కల్లగా స్థానికులు పేర్కొంటున్నారు. పార్టీకి కేడర్ బలంగా ఉంది.. సమర్థ నాయకుడిగా నిరూపించుకోవాలంటే కష్టపడాల్సింది పోయి జ్యోతిష్కులను నమ్మడం సరికాదని ఉత్తరప్రదేశ్ వాసులు చెబుతున్నారు. ఎదురుగా బలమైన శత్రువు ఉండగా ఎదుర్కోవాల్సిన వ్యక్తి జ్యోతిష్య నమ్మడం సరికాదని సొంత పార్టీ నాయకులే చెబుతున్నారు. 2020 ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని.. నిస్తేజంలో ఉన్న శ్రేణులకు ప్రోత్సాహం ఇవ్వాలని ఎస్పీ నాయకులు చెబుతున్నారు. అధికారం అనేది ఊరికే రాదు.. కష్టపడాలని సూచిస్తున్నారు. ఆయన జ్యోతిష్కం నమ్మడంతో ప్రజలు మూఢ నమ్మకాల బారిన పడతారిన.. ఇప్పటికే క్రైమ్ రికార్స్డ్ లో ఉత్తరప్రదేశ్ పేరు మార్మోగుతుంది. ఈ సమయంలో జ్యోతిష్కం వంటి మాటలు కట్టిపెట్టి ప్రజల్లోకి వెళ్తే కొంతలో కొంతయినా లాభం ఉంటుంది. ఇదే గ్రహిస్తే అఖిలేశ్ యాదవ్ రాజకీయంగా నిలబడుతాడు.. లేదంటే రాహుల్ గాంధీ, లోకేశ్ సరసన చేరిపోతాడు.



Tags:    

Similar News