కొద్దికాలం క్రితం తారాస్థాయికి చేరి ఇటీవలే సద్దుమణిగింది అనుకుంటున్న సమాజ్ వాదీ పార్టీలో మరో ఎపిసోడ్‌లో కలకలం మళ్లీ రేగింది. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ అనుచరుడు అమర్ సింగ్ మరోమారు యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పై సంచలన విమర్శలు చేశారు. అఖిలేష్ మద్దతుదారు తనను చంపుతానని బెదిరించాడని ఆరోపించారు. వారి బెదిరింపులు చూస్తుంటే తనను చంపుతారేమోనని భయం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అఖిలేష్ యాదవ్ తో పాటు ఆయన బాబాయ్-ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్ పైనా అమర్ సింగ్ విమర్శలు చేశారు. రాంగోపాల్ యాదవ్, అఖిలేశ్ అండతో వారు మనుషులు తనను టార్గెట్ చేశారని ఏకంగా బహిరంగంగా చంపుతానని బెదిరిస్తున్నారని అమర్ సింగ్ వాపోయారు. ఈ హెచ్చరికలతో తన జీవితమే ప్రమాదంలో పడిందని అమర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ సందర్భంగా తన రాజకీయ గురువు ములాయం సింగ్‌కు మాత్రం మద్దతు కొనసాగించారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా తాను మాత్రం ములాయం సింగ్ యాదవ్‌తోనే నిలుస్తానని అమర్ సింగ్ స్పష్టం చేశారు. ఇటీవల సీఎం అఖిలేష్‌ను తాను అభినందించిన మాట నిజమేనని అయితే దాని అర్థం సస్పెండ్ చేసిన తనను పార్టీలోకి తీసుకోవాలని బ్రతిమాలడం కాదని అమర్ సింగ్ స్పష్టం చేశారు. తాను ఎప్పటికీ ములాయం సింగ్ వాదినని తేల్చిచెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/