ఇంత మొనగాడు సీఎం మరొకరు ఉంటారా?

Update: 2016-03-11 07:30 GMT
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తీసుకున్న ఒక నిర్ణయాన్ని ఘనంగా కీర్తించాల్సిందే. చిన్న విమర్శతో కూడిన వార్త వస్తేనే సహించలేక.. విపరీతమైన అసహనం వ్యక్తం చేసి.. ఏదేదో రంగులు పూసేనే నాయకులున్న ఈ రోజుల్లో.. తనపై వ్యంగ్యంగా వచ్చిన కార్టూన్లను ఏకంగా ఒక పుస్తకంగా వేయించుకునే దమ్ము యూపీ సీఎం అఖిలేశ్ కు తప్పించి మరొకరు ఉండరేమో?

తనపై వచ్చిన వ్యంగ్య కార్టూన్లను ఒక పుస్తకంగా అచ్చేందుకు ఆయన ఓకే చేప్పటం చూసినప్పుడు ఈ తరహా ధోరణి ఈ రోజుల్లో చాలా కష్టమనే చెప్పాలి. తన పాలనలో తీవ్ర విమర్శలకు గురి చేసిన అంశాలకు సంబంధించిన కార్టూన్లు కూడా ఈ పుస్తకంలో ఉండటం గమనార్హం. తనపై వచ్చే విమర్శల్ని సానుకూలంగా తీసుకోవటం.. వాటిపై దృష్టి సారించటంతో పాటు.. ఈ స్థాయి మెచ్యూరిటీ ఉన్న ముఖ్యమంత్రులు ఇప్పటి కాలంలో తక్కువని చెప్పక తప్పదు.

తన పదవీ కాలంలో తనపై వచ్చిన కార్టూన్ల సంకలనానికి ‘‘టేపు క అఫ్సనా’’ పేరుతో వేస్తున్నారట. అఖిలేశ్ ను ‘‘టేపు’’ అని కూడా పిలుస్తారట. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. అఖిలేశ్ కు కార్టూన్లు అంటే మహా ఇష్టమట. ఆయన తనపై వచ్చిన కార్టూన్లను తన మొబైల్ ఫోన్లో ఉంచుకుంటారట. విమర్శను స్ఫూర్తిగా తీసుకొని.. ఎత్తి చూపిన లోపాన్ని సరి చేసే సానుకూల వైఖరి ఒక ముఖ్యమంత్రిలో ఉండటం.. అందులోనూ యువనేత కావటం ఆసక్తికర విషయంగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News