సీఎం దంపతులకు లిఫ్ట్ సినిమా

Update: 2015-12-19 04:05 GMT
లిఫ్ట్ అనుభవాలు ఈ మద్య చేదుగా ఉంటున్నాయి. ప్రముఖులు పలువురు వీటి బారిన పడుతున్నారు. తాజాగా ఆ జాబితాలో యూపీ ముఖ్యమంత్రి.. ఆయన సతీమణి చేరారు. ముఖ్యమంత్రి.. స్పీకర్ మాత్రమే వినియోగించే లిఫ్ట్ సరిగా పని చేయకపోవటంతో వారిద్దరూ అందులో ఇరుక్కుపోయారు. దీంతో.. భద్రతా సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు. అయితే.. ఈ లిఫ్ట్ అసెంబ్లీలో ఉండటంపై విమర్శలు చెలరేగుతున్నాయి.

ప్రైవేటు పంక్షన్ కు వెళ్లి.. ఎక్కడో లిఫ్ట్ ఆగిపోయిందనుకుంటే ఫర్లేదు కానీ.. అసెంబ్లీలో.. అది కూడా స్పీకర్.. ముఖ్యమంత్రి మాత్రమే వినియోగించే లిఫ్ట్ ఈ విధంగా పని చేయటంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నిప్పులు చెరిగారు. తన భార్య.. ఎంపీ డింపుల్ తో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు అసెంబ్లీకి వచ్చారు. అక్కడ ప్రత్యేక లిఫ్ట్ లో ఎక్కారు. అయితే.. అది ఎంతసేపటికి ఓపెన్ కాని పరిస్థితి. దాదాపు అరగంటపాటు కిందామీదా పడ్డాక కానీ.. లిఫ్ట్ డోర్ ఓపెన్ కాలేదు.  ఈ ఘటనపై అఖిలేష్ సీరియస్ అయ్యారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. భార్యతో పాటు.. అరగంట సేపు లిఫ్ట్ లో ఇరుక్కుపోవటం.. బాధితులుగా సీఎం దంపతులు కావటంతో భద్రతా సిబ్బందికి భారీ క్లాస్ పడిందంటున్నారు.
Tags:    

Similar News