చదివింది పది.. ఐటీ హబ్ లో జాబ్.. ఉగ్రవాదులతో లింక్?

Update: 2022-07-26 01:30 GMT
అక్తర్ హుస్సేన్ 10వ తరగతి చదివాడు.. రెండేళ్ల క్రితం బెంగళూరు చేసుకొని ఐటీ హబ్ లో జాబ్ చేస్తున్నాడు.. కానీ చేసేది మాత్రం ఉగ్రవాదులతో లింక్.. పలు ప్రాంతాల్లో నివాసం ఉండి చివరికి తిలక్ నగర్ చేరుకొని ఉగ్రవాదులకు రహస్యంగా పనిచేస్తున్నాడు. ఐబీ తెలుసుకొని వలపన్ని పట్టుకుంది.

అక్తర్ హుస్సేన్ అనే లష్కర్ ఉగ్రవాదిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు.  అసోంకు చెందిన అక్తర్ హుస్సేన్ లష్కర్ అనే అనుమానిత ఉగ్రవాది బెంగళూరులోని తిలక్ నగర్ లో మకాం వేసి కొందరు యువకులకు బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాదం వైపు ఆకర్షితులను చేస్తున్నాడని పోలీసులు అంటున్నారు.

అక్తర్ హుస్సేన్ లష్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అంతర్జాతీయ ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకున్నాడని ఐబీ అధికారులు సమాచారం ఇచ్చారని తెలిసింది. అక్తర్ హుస్సేన్ లష్కర్ ను సీసీబీ పోలీసులు రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు.

అంతర్జాతీయ ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకున్న ఉగ్రవాది అరెస్ట్ కావడంతో బెంగళూరు ప్రజలు హడలిపోయారు. ఐటీ హబ్ లో ఇలాంటి ఉగ్రవాద సానుభూతి పరులు మకాం వేసి ఉంటున్నారా? అని హతాషులయ్యారు.

అక్తర్ హుస్సేన్ 10వ తరగతి చదివాడని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగుచూసింది.  అక్తర్ హుస్సేన్ లష్కర్ అంతర్జాతీయ ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకున్నాడని సమాచారం అందడంతో సోమవారం వేకువ జామున బెంగళూరు సీసీబీ పోలీసులు అతడి ఇంటిమీద దాడి చేసి అరెస్ట్ చేశారు.

అక్తర్ హుస్సేన్ లష్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అంతర్జాతీయ ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకున్నాడని ఐబీ అధికారులు సమాచారం ఇచ్చారని తెలిసింది. అక్తర్ హుస్సేన్ ను లష్కర్ ను సీసీబీ పోలీసులు రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు.
Tags:    

Similar News