టాలీవుడ్‌ను షేక్ చేస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోన్న మాదక ద్రవ్యాల కేసుకు సంబంధించి మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటోంది. డ్రగ్స్ రాకెట్‌ను బయట పెట్టటమే కాదు.. దాని అంతు చేసే వరకూ నిద్ర పోని రీతిలో వ్యవహరిస్తూ.. డ్రగ్స్ బాబుల గుండెల్లో నిద్ర పోతున్న ఎక్సైజ్ డీజీ అకున్ సబర్వాల్ తన సెలవును క్యాన్సిల్ చేసుకున్నారు.
తన వ్యక్తిగత అవసరాల మేరకు ఆయన ఆదివారం నుంచి పది రోజుల పాటు సెలవు పెట్టుకున్నారు. అయితే.. డ్రగ్స్ రాకెట్‌ను చేధించిన నేపథ్యంలో ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంతోనే ఆయనసెలవు పెట్టుకున్నట్లుగా మీడియాలో భారీ ఎత్తున వార్తలు వచ్చాయి. వివిధ రంగాలకు చెందిన పెద్ద తలకాయల పిల్లలకు డ్రగ్స్ తో సంబంధాలు ఉన్న నేపథ్యంలో.. అకున్ కానీ ఈ కేసు సంగతి చూస్తే.. ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఆయన్ను సెలవులో పంపుతున్నట్లుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే.. వాస్తవం మాత్రం వేరుగా ఉందని తెలుస్తోంది. అకున్ పెట్టుకున్న సెలవు.. ఆయన రెండు నెలల కిందట పెట్టుకున్నదని.. ఆయన వ్యక్తిగత అవసరాల కోసం ముందుగా పెట్టుకున్న సెలవు వేళకు.. డ్రగ్స్ ఉదంతం తెర మీదకు రావటం యాదృశ్చికంగా జరిగిందే తప్పించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు.
నిజానికి తాజా డ్రగ్స్ కేసు ప్రభుత్వానికి మేలు చేస్తుందే తప్పించి కీడు చేసే ఛాన్స్ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కేసు ద్వారా.. తమ ప్రభుత్వం నేరస్తుల విషయంలో ఎంత కచ్చితత్వంతో వ్యవహరిస్తుందో తెలియజేస్తుందని.. ఇలాంటి అవకాశాన్ని ఏ ప్రభుత్వం మాత్రం వదులుకుంటుందని చెబుతున్నారు.
మీడియాలో తన సెలవుపై రకరకాల వార్తలు వచ్చిన నేపథ్యంలో అకున్ తన సెలవుల్ని కేసు విచారణ పూర్తి అయ్యే వరకూ వాయిదా వేసుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. డగ్స్ర్ కేసు దర్యాప్తు పూర్తి అయ్యే వరకూ సెలవుల్ని వాయిదా వేసుకుంటున్నట్లుగా అకున్ వెల్లడించారు. తన మీద ఎలాంటి ఒత్తిళ్లు లేవని.. ఈ కేసు విషయంలో ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని ఆయన చెప్పారు. కేసు తీవ్రత దృష్ట్యా సెలవుల నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా వెల్లడించారు.