జెఫ్ బేజేస్ కు షాకిచ్చిన ఎలన్ మస్క్..

Update: 2021-11-05 07:42 GMT
ప్రపంచ కుభేరుల మధ్య పోటీ తీవ్రమవుతోంది. మొదటి రెండు స్థానాల్లో ఉన్న ఎలన్ మస్క్, జెఫ్ బేజేస్ లు ఇప్పటికే అంతరిక్షయానం చేసి విజయం సాధించారు. దీంతో అంరిక్షానికి సంబంధించిన పలు ప్రాజెక్టులను దక్కించేకునేందు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో వీరి మధ్య విమర్శలు తీవ్ర స్థాయికి చేరాయి. తాజాగా స్పెస్ ఎక్స్, బ్లూ ఆరిజన్ సంస్థల మధ్య మొదలైన వివాదం తారాస్థాయికి చేరింది. ఇందులో ఎలన్ మస్క్ పైచేయి సాధించారు. ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో మొదటి స్థానంలో ఎలన్ మస్క్ ఉండగా.. రెండో స్థానంలో జెఫ్ బేజేస్ ఉన్నారు. అయితే మొదటి స్థానాన్ని దక్కించుకునేందుకు జెఫ్ బేజేస్ ఎలెన్ మస్క్ తో పోటీ పడుతున్నారు. కానీ ఎలెన్ మాత్రం ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నాడు.

చంద్రుడిపై మానవసహిత రాకెట్ ను పంపేందేకు నార్త్ అమెరికా స్పేస్ ఏజెస్నీ (నాసా) ప్రయోగాలు ఇప్పటికే మొదలు పెట్టింది. ఇందుకోసం రెగ్యులర్ గా ప్రయోగాలు చేస్తోంది. అర్టెమిస్ ప్రాజెక్టులో భాగంగా వ్యోమగాములను చంద్రుడిపై పంపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా లునార్ ల్యాండర్ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టు ద్వారా వ్యోమగాములు చంద్రుడిపైకి వెళ్లి.. తిరిగి సురక్షితంగా భూమిపైకి చేరేలా ప్లాన్ వేస్తున్నారు. ఈ అర్టెమిస్ ప్రాజెక్టు పనులు ప్రభుత్వ, ప్రైవేట్ లు కలిసి చేస్తున్నాయి. అయితే చంద్రుడిపై పంపే లునార్ ప్రాజెక్టును చాకచక్యంగా ఎలన్ మస్క్ దక్కించుకున్నారు. ఈ ప్రాజెక్టు విలువ 2.9 బిలియన్ డాలర్లుగా నిర్ణయించారు.

ఎలన్ మస్క్ లూనార్ ప్రాజెక్టు దక్కించుకోవడం బ్లూ ఆరిజిన్ తట్టుకోలేకోపోయింది. దీంతో నాసాపై బ్లూఆరిజన్ విమర్శలు చేసింది. అంతేకాకుండా ఈ వ్యవహరంపై ఫెడరల్ కోర్టుకు కూడా వెళ్లింది. టెక్నాలజీ పరంగా అనేక లోపాలు ఉన్నప్పటికీ లూనార్ ప్రాజెక్టును స్పెస్ ఎక్స్ కు కట్టబెట్టారని ఆరోపించింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఈ విషయంలో నాసా ఎవరివైపు మొగ్గు చూపకపోయినా వివాదాన్ని త్వరగా పరిష్కరించాలని నాసా సైతం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే ఇరు వాదనలు విన్న కోర్టు బ్లూ ఆరిజన్ అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఈ ప్రాజెక్తును నాసా ముందకు తీసుకెళ్లవచ్చని కోర్టు తీర్పునిచ్చింది. దీంతో బెజోస్ పై ఎలెన్ మస్క్ పైచేయి సాధించినట్లయింది.

ఈ తీర్పుపై జెఫ్ బేజేస్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఫెడరల్ కోర్టు తీర్పును గౌరవిస్తామని ట్వీట్ చేశారు. అయితే బేజేస్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. గతంలో బేజేస్ అంతరిక్షయానం వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అమెజాన్ అధినేత అయిన బేజేస్ ఈ కస్టమర్లు, ఉద్యోగులల డబ్బులు వాడి వెళ్లోచ్చారనే అభాప్రాయం వ్యక్తమైంది. అయితే అంతకంటే ముందే కొందరు స్పేస్ యాత్రకు వ్యతిరేకంగా అమెజాన్ కస్టమర్లు తమ ప్రైమ్ మెంబర్ షిప్ ను రద్దు చేసుకున్నట్లు తెలిసింది.

మరోవైపు అమెరికా ప్రభుత్వానికి పన్నులు కట్టకుండా స్పేస్ టూర్లు చేస్తున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. జెఫ్ బెజోస్ జూలై 20న 11 నిమిషాల్లో అంతరిక్ష యాత్ర చేశారు. ఈ యాత్ర కోసం 16 లక్షల డాలర్లను ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే అంతరిక్ష యాత్ర చేసిన కొద్ది రోజులకే బెజోస్ ప్రపంచ కుభేరుల్లో రెండో స్థానానికి వచ్చినట్లు తెలుస్తోంది. బెజొస్ స్థానాన్ని ప్రముఖ లగ్జరీ గూడ్స్ లూయిస్ విట్టన్ మోయోట్ హెన్నెస్సీ అధినేత బెర్నాల్డ్ ఆర్నాల్డ్ సొంతం చేసుకున్నాడు. బెర్నాల్డ్ ఆర్నాల్డ్ 200.5 బిలియన్ డాలర్లతో మొదటి ప్లేసు ఉండగా.. జెఫ్ బెజోస్ 190.7 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు.


Tags:    

Similar News