కరోనా మహమ్మారిని అరికట్టడానికి ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించింది. ఈ లాక్ డౌన్ కారణంగా మద్యం షాపులు మూతపడిన సంగతి తెలిసిందే. మందు దొరక్కపోవడంతో మద్యం ప్రియులు విలవిలలాడిపోతున్నారు. మద్యం కోసం ఎన్నో అవస్థలు పడుతున్నారు. మరికొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. లాక్ డౌన్ ఎప్పుడెప్పుడు ఎత్తివేస్తారా? మద్యం షాపులు ఎప్పుడు తెరుస్తారా? అని మందుబాబులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మద్యం దొరక అనేక రకాలుగా మద్యం కోసం ప్రయత్నాలు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు.
ఈ తరుణంలో మద్యం షాపులు తెరవడంపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మద్యం షాపులు తెరిచేందుకు పర్మిషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామని ప్రకటించింది. అయితే ఓ కండీషన్ పెట్టింది. భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రభుత్వ ఆదేశాల అనుసారంగా నడుచుకుంటే మద్యం షాపులు తెరిచే ఉంటాయని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ టోఫే తెలిపారు. ప్రజల్లో క్రమశిక్షణ లేకపోవడం వల్లే మద్యం షాపులపై తాత్కాలిక నిషేధం విధించాల్సి వచ్చిందని అయన తెలిపారు.
ప్రజలు కనుక భౌతిక దూరాన్ని పాటించినట్లయితే మద్యం దుకాణాలను మూసేయాల్సిన అవసరం ఏముంది? కరోనాను కట్టడీ చేయాలంటే కాస్త కఠినంగానే వ్యవహరించాలి. మద్యంపై నిషేధం అందులో భాగమే అని మంత్రి రాజేష్ అన్నారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడానికి - ఉపాధి కల్పించడానికి రాష్ట్రంలో డిస్టిలరీ నుంచి వైన్ షాపుల వరకు విడతల వారీగా వ్యాపారం ప్రారంభించడానికి అనుమతించాలని కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరెజ్ కంపెనీస్ (సీఐఏబీసీ) సీఎం ఉద్ధవ్ థాక్రేను గతవారం కోరింది.
దీనిపై చర్చించిన ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. భౌతిక దూరం నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తేనే మద్యం షాపులను తెరవడానికి అనుమతించాలని ప్రభుత్వం కండీషన్ పెట్టింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. మహారాష్ట్రలో సోమవారం నుంచి పాక్షిక స్థాయిలో వ్యాపార కార్యకలాపాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ముంబై ప్రభుత్వం చేసిన ప్రకటన తో మందుబాబులు ప్రాణాలు తిరిగొచినట్టు అయ్యింది. అయితే , ఇప్పటికే కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో మద్యం షాపులు తెరిస్తే ..కరోనా మరింత వేగంగా విస్తరిస్తుంది అని ఆందోళన చెందుతున్నారు. ప్రజల ప్రాణాల కన్నా విలువైనది ఏదీ లేదంటూ కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మద్యం షాపులు తెరవడానికి అనుమతి ఇవ్వని సంగతి తెలిసిందే. అందులో తెలంగాణ ప్రభుత్వం కూడా ఒకటి. లాక్ డౌన్ ముగిసే వరకు మధ్య దుకాణాలు తెరిచే ప్రసక్తే లేదు అని సీఎం కేసీఆర్ ఇప్పటికే పలు సార్లు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.