మందు మంచిదే! మితంగా తీసుకుంటే రోగాలను తగ్గిస్తుందట!

Update: 2020-11-05 01:30 GMT
అల్కహాల్​తో తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అనే మాట మనం ఇప్పటికే ఎన్నో సార్లు వినివింటాం. ఈ విషయం మందు బాటిల్​మీద రాసే ఉంటుంది. కానీ వారానికోసారి.. పరిమితంగా మందు తీసుకుంటే మంచిదని ఓ అధ్యయనం తేల్చిచెప్పింది. అతిగా మందు తీసుకుంటే ప్రమాదమే అని కూడా ఆ సర్వే హెచ్చరించింది. కానీ లిమిట్​గా తీసుకుంటే కొన్ని రోగాలు కూడా దూరమవుతాయట. తక్కువ మోతాదులో మద్యం తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని కొన్ని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. డెమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు మద్యపానం తోడ్పడుతుందట.

తాజాగా చేసిన స్టడీ ప్రకారం.. మద్యం తీసుకున్న వారికంటే ఎప్పుడో ఓ సారి తక్కువ మోతాదులో మద్యం సేవించే వారికి డెమెన్షియా, అల్జీమర్స్ వంటి రోగాలు రావని ఈ అధ్యయనం తేల్చింది. డెమెన్షియా దీన్ని చిత్తవైకల్యం అంటారు. మనిషి అయోమయంగా మాట్లాడటం. కొద్దిగా మతిమరుపు రావడం ఈ వ్యాధి లక్షణాలు.. మెదడులో కణాలు దెబ్బతినడం వల్ల కలిగే అల్జీమర్స్​ అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి తీవ్రమైతే మనిషికి మతిమరుపు రావడంతో పాటు దగ్గరి వాళ్లను కూడా గుర్తుపట్టలేకపోతారు. ఈ రెండు వ్యాధులు తగ్గిపోతాయని ఇప్పటికిప్పుడు ఎవరూ మద్యపానం అలవాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఇది ఓ అధ్యయానికి సంబంధించిన వార్త మాత్రమే.
Tags:    

Similar News