మద్యాన్ని నిషేధిస్తే..తాగేవారు పెరుగుతున్నారట!

Update: 2020-12-18 17:30 GMT
మద్యం మానేయాలంటే మద్యాన్ని నిషేధించాలని చాలామంది అంటుంటారు. కానీ , మద్యం నిషేదించిన తర్వాత మద్యాన్ని తాగే వారి సంఖ్య భారీగా పెరిగిపోతోందట. భారత్ లోని కొన్ని రాష్ట్రాల్లో మద్యపానం నిషేధించిన తర్వాతే ఆల్కాహాల్ సేవించే వారి సంఖ్య పెరిగిందని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. ఆల్కహాల్ కంజ్యుమ్షన్ కు సంబంధించి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019-20 నిర్వహించింది. ఈ సర్వేకు సంబంధించి డేటాను డిసెంబర్ 15న విడుదల చేసింది. ఇందులో ఆల్కహాల్ నిషేధిత రాష్ట్రాల్లోనే ఎక్కువగా మద్యాన్ని సేవిస్తున్నారని వెల్లడించింది. ఆల్కహాల్ విక్రయాలను బ్యాన్ చేసినప్పటికీ బిహార్, మిజోరం, నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లో మరి ఎక్కువగా తాగేస్తున్నారంట.. మద్యపాన నిషేధం లేని రాష్ట్రాల్లో కంటే ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఆల్కాహాల్ సేవిస్తున్నారని అధ్యయనంలో గుర్తించారు.

ఆల్కహాల్ బ్యాన్ చేసే ప్రయత్నాల్లో భాగంగా కొన్ని రాష్ట్రాలు సక్సెస్ సాధించాయి. బీహార్‌ లో 2016లో సీఎం నితీశ్ కుమార్ ఆల్కహాల్ బ్యాన్ చేశారు. అయినప్పటికీ అక్రమంగా మద్యం విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. దాంతో ఈ వారమే రాష్ట్రంలో ఆల్కహాల్ నిషేధాన్ని సీఎం నితీశ్ మరింత కఠినతరం చేశారు. NFHS సర్వేలో ఆల్కహాల్ సేల్, కంజ్యుమ్షన్ పై బ్యాన్ ఎంతవరకు సక్సెస్ అయిందో పలు విషయాలను వెల్లడించింది. ఇందులో ఎలాంటి మద్యపాన నిషేధం లేని రాష్ట్రాల్లో కంటే, ఆల్కహాల్ నిషేధిత రాష్ట్రమైన ఒక్క బీహార్‌ లోనే అత్యధిక స్థాయిలో ఆల్కహాల్ సేవిస్తున్నారని పేర్కొంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 15.8శాతంగా ఉంటే.. పట్టణ ప్రాంతాల్లో 14శాతం మంది పురుషులు మద్యాన్ని సేవిస్తున్నారని అధ్యయనంలో వెల్లడింది.

తెలంగాణలో కూడా మద్యపానంపై ఎలాంటి ఆంక్షలు లేవు. దాంతో తెలంగాణ కూడా 43.3శాతంతో హైయిస్ట్ ర్యాంకు జాబితాలోకి చేరింది. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్ 5.8శాతంతో దిగువ స్థాయిలో ఉంది. ఇక కేంద్రపాలిత ప్రాంతమైన లక్ష్యదీప్ లో కూడా ఆల్కహాల్ బ్యాన్ అయింది. ఇక్కడ 0.4 శాతం మంది పురుషులు ఆల్కహాల్ సేవిస్తున్నారు. నాగాలాండ్ లో 24శాతం ఉంటే.. మిజోరంలో 23.8శాతం మంది పురుషులు ఆల్కాహాల్ సేవిస్తున్నారు. మిజోరంలో పొగాకు తాగడాన్ని నిషేధించినప్పటికీ కూడా ఫస్ట్ ర్యాంకులో చేరింది. పొగాకు వాడేవారిలో 61.6శాతం మహిళలు ఉంటే.. 72.9శాతం మంది పురుషులు పొగాకును తాగుతున్నారు. ఇక గోవా, కర్ణాటకలు 10.4శాతం, 17.8శాతంతో జాబితా చివరిలో ఉన్నాయి.
Tags:    

Similar News