అబద్ధమో నిజమో ఏదో ఒకటి వెలుగులోకి వస్తేనే కదా ! వాస్తవాలు అన్నవి జనంలోకి వెళ్లడమో లేదా అవాస్తవ ప్రచారం అన్నది హాయిగా చేయడం అన్నది కుదురుతుంది.ఇదే మాట విపక్ష సభ్యులు అంటున్నారు.తాము చెప్పిన విధంగా లేదా తాము ఆరోపిస్తున్న విధంగా రాష్ట్రంలో నాటు సారా తయారీ, అమ్మకం యథేచ్ఛగా సాగిపోతున్నా వైసీపీ మాత్రం అదేమీ లేదే అని బుకాయిస్తోందని తెలుగుదేశం పార్టీ ఆవేదన చెందుతోంది.త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొన్ని దురాగతాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని,పల్లెల్లో కల్తీ సారా విక్రయాలు పెరిగిపోవడానికి కారణం కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న విధానాలేనని అంటున్నాయి టీడీపీ వర్గాలు.ఇదే సమయంలో వైసీపీ కూడా సీన్లోకి వచ్చి టీడీపీ ఆరోపణలను అడ్డుకుంటోంది. తాము చెబితే పోలీసులు దాడులు చేస్తున్నారని ఆ విధంగా తమ ముఖ్యమంత్రి అత్యంత పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నారని అంటూ..కొన్ని వ్యాఖ్యలు ఆసక్తికర రీతిలో చేస్తున్నారు.
అవును! ఒడిశా కేంద్రంగా వచ్చే మందును ఎవరు ఆపాలి ?
మేం కాదు కదా మీరే ఆపాలి కానీ ఎందుకు ఆపడం లేదు అని టీడీపీ కౌంటర్లు ఇస్తోంది. ఏమయినా కూడా ఉద్దానం కిడ్నీ వ్యాధి ప్రబలేందుకు అయినా లేదా మరికొన్ని కుటుంబాలు ఛిద్రం అయ్యేందుకు అయినా ఆ రోజు ఈరోజు కారణం కల్తీ సారానే అన్నది సుస్పష్టం.వీటిపై పాలక పార్టీలు అజాగ్రత్తగా ఉంటూ ఏవో మూడు నాలుగు రోజుల హడావుడి తరువాత సైలెంట్ అయిపోతే ఎవ్వరం ఏం చేయలేం?
ఈ దశలో రాష్ట్ర వ్యాప్తంగా సారా మరణాలు సంచలనాలను నమోదు చేస్తున్న వేళ పులివెందులలో ఆసక్తికర పరిణామాలు వెలుగు చూశాయి. ఇక్కడ నాటు సారా బట్టీలను పోలీసులు ధ్వంసం చేశారు.ఆ వీడియోలను తెలుగు దేశం పార్టీ నాయకులు లోకేశ్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేశారు.వాస్తవానికి జంగారెడ్డి గూడెం ఘటన తరువాత అప్రమత్తం అయిన పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తూనే ఉన్నారు.అరెస్టులు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.ఇప్పటిదాకా ఐదు లక్షల లీటర్లకు పైగా నాటు సారా బట్టీలను ధ్వంసం చేశామని పోలీసులు వెల్లడిస్తున్నారు.
ఈ క్రమంలో పులివెందుల అంటే సాక్షాత్తూ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో నాటు సారా బట్టీలను పోలీసులు ధ్వంసం చేసి అందరి ప్రశంసలూ అందుకుంటున్నారు.మరి! యాభై వేల మందికి పైగా ఉన్న ఓ చిన్న ఊరు జంగారెడ్డి గూడెంలో సారా తయారీ ఎలా సాధ్యం అని అసెంబ్లీలో ప్రశ్నించిన జగన్ వీటిపై ఏమంటారో అని విపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి.తమను మాట్లాడనివ్వకుండా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినంత మాత్రాన నిజాలు అబద్ధాలు అయిపోవని,అబద్ధాలు అన్నవి ఎల్లకాలం నిజాలుగా చెలామణీ కావని, అలా చేయాలని చూసినా కూడా అది సాధ్యం కాదని ఇప్పటికే లోకేశ్ వ్యాఖ్యానించారు.
"నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందనే శాపమేమైనా మీకు ఉందా YS Jagan Mohan Reddy గారు? అబద్ధాలే శ్వాసగా బ్రతికేస్తున్నారు! ఇదిగో మీ ఊళ్లో నాటు సారా బట్టీ. జంగారెడ్డి గూడెం లాంటి పట్టణంలో నాటు సారా కాస్తారా అని అమాయకంగా అడిగారు.ఇప్పుడు మీ సొంత ఊరు పులివెందులలోనే నాటు సారా బట్టీలు బయటపడ్డాయి. దీనికి ఏం సమాధానం చెపుతారు? ఒక్క పులివెందుల నియోజకవర్గంలోనే 2021 జనవరి నుండి ఇప్పటి వరకూ 300 కేసులు నమోదయ్యాయి. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజవర్గంలోనే సారా ఏరులై పారుతుంటే ఇక రాష్ట్రంలో సారా మరణాలకి అంతు లేదు.." అని నారా లోకేశ్ ఒక పోస్టు సోషల్ మీడియాలో ఉంచారు.ఈ పోస్టులో పులివెందులలో పోలీసులు నాటు సారా బట్టీలను ధ్వంసం చేస్తున్న వీడియోను కూడా ఉంచారు.