మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టి20 మ్యాచ్ ఆడేందుకు ప్రస్తుతం ఆస్టేలియా క్రికెట్ జట్టు పాకిస్థాన్ లో పర్యటిస్తోంది. 1998 తర్వాత ఆసీస్ జట్టు పాక్ గడ్డపై అడుగుపెట్టడం ఇదే తొలిసారి. అంటే రెండు పుష్కరాలు గడిచిపోయినట్లన్నమాట. అయితే, ఆదిలోనే హంసపాదులా ఆ జట్టు ఆల్ రౌండర్ ఆస్టన్ ఆగర్ ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి.
ఆగర్ భార్యకు ఈ మేరకు ఈ మెయిల్ వెళ్లింది. అయితే, అంతా సజావుగా సాగి.. తొలి టెస్టు ముగిసింది. రావల్పిండిలో జరిగిన తొలి టెస్టులో మొత్తం 5 రోజుల ఆటలో కేవలం 14 వికెట్లే పతనమైన నేపథ్యంలో ఆ పిచ్‌పై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఐసీసీ సైతం దానిపై స్పందించింది. ఇది అత్యంత సాధారణ పిచ్ అని అభివర్ణించింది.
‘ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య తొలి టెస్టుకు ఉపయోగించిన రావల్పిండి పిచ్‌లో తొలిరోజు నుంచి చివరి రోజు వరకు పెద్దగా మార్పులు కనబడలేదు. కొద్దిపాటి బౌన్స్ తప్పితే అటు పేసర్లకు ఇటు స్పిన్నర్లకు ఏమాత్రం సహకరించలేదు. బంతికి, బ్యాట్‌కు మధ్య సమానమైన పోటీనే లేదు. ఈ పిచ్‌ను అత్యంత సాధారణ పిచ్‌గా రేటింగ్ ఇచ్చాం’ అని మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగలె పేర్కొన్నారు.
రిఫరీ ఇచ్చిన నివేదికతో రావల్పిండి వేదికకు ఐసీసీ ఒక అయోగ్యత పాయింట్ ఇచ్చింది. ఇక ఈ మ్యాచ్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 476/4 స్కోరు సాధిస్తే.. ఆస్ట్రేలియా 449 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆట నిలిచిపోయే సమయానికి పాక్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 252 పరుగులు చేసింది. దీంతో ఇది డ్రాగా ముగిసింది. రావల్పిండిలో తొలి టెస్టు ఆడిన అనంతరం రెండు జట్ల ఆటగాళ్లు ఇప్పుడు కరాచీకి చేరుకున్నారు.
అక్కడి హోటల్‌లో బసచేసిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు సరదాగా స్విమ్మింగ్‌పూల్ వద్ద ఏదో మాట్లాడుకుంటుండగా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చూసుకోకుండా వెళ్లి అందులో పడిపోయాడు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా అభిమానులు సరదాగా నవ్వుకుంటున్నారు.