కరోనాతో అల్లకల్లోలంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం జగన్ ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ప్రతీ కేబినెట్ మీటింగ్ లోనూ ప్రజలపై వరాల జల్లుతో పాటు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ ఈసారి ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ ఊపేస్తోంది.
ఈనెల 15న ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం జగన్ సంకల్పించారు. 15న ఉదయం 11 గంటలకు వెలగపూడిలోని సచివాలయం ఒకటో బ్లాక్ లో మంత్రిమండలి భేటి జరగనుంది. పలు అభివృద్ధి కార్యక్రమాలు, కరోనా నియంత్రణ చర్యలపై సహా పలు అంశాలపై చర్చించి మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు రెడీ చేయాలని సంబంధిత అధికారులకు సీఎస్ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. జూలై 13న సాయంత్రం 5 గంటలలోపు ప్రతిపాదనలు సిద్ధంగా ఉంచాలని సూచించారు.
గత నెల 11న జరిగిన కేబినెట్ మీటింగ్ లో ‘జగనన్న తోడు’, వైఎస్సార్ చేయూత, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇళ్లపట్టాలు, నర్సింగ్ పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.