తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన కీలక వ్యవహారాలన్నీ సోమవారం అర్థారాత్రి దాటిన తర్వాతే మొదలు కానున్నాయి. కొత్త జిల్లాలకు సంబంధించి ఇప్పటివరకూ అనుకుంటున్నట్లే 31 జిల్లాలకు ఫైనల్ చేసేశారు. దీనికి సంబంధించిన తుది నోటిఫికేషన్ మంగళవారం విడుదల చేస్తారని అనుకున్నప్పటికీ.. అందుకు భిన్నంగా సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత విడుదల చేయాలని నిర్ణయించారు. సాంకేతికంగా మంగళవారం డేట్ లోనే విడుదల అయ్యే కొత్త జిల్లాల జాబితాతో.. జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో కీలక ఘట్టం మొదలవుతుందని చెప్పాలి.
సోమవారం అర్థరాత్రి 12.40 గంటలకు కొత్త జిల్లాలకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు విడుదల చేస్తారని చెబుతున్నారు. అర్థరాత్రి దాటిన తర్వాత జీవో విడుదల చేస్తే.. మరి ఏర్పాట్ల మాటో? అన్న సందేహం అక్కర్లేదు. దీనికి సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు మొత్తం సోమవారంలోనే సెట్ చేయనున్నారు. ఏ జిల్లాలకు కలెక్టర్లుగా ఎవరిని నియమించాలన్న నిర్ణయంతోపాటు.. కీలక అధికారులకు సంబంధించిన నియామకాలు.. అధికారుల పని విభజనకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని సోమవారం సాయంత్రం లోపే అనధికారికంగా ఇవ్వనున్నారు.
కొత్త జిల్లాలకు కలెక్టర్లుగా ఎవరిని నియమించాలన్న అంశంపై ఇప్పటికే కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్లుగా చెబుతున్నారు. కలెక్టర్లుగా.. కొత్త జిల్లాలకు సంబంధించి సాంకేతిక అంశాలపై పట్టు ఉన్న వారికే అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన జాబితాను తనకు ఇవ్వాలని.. వారి గత పని తీరు ఆధారంగా ర్యాంకింగ్ ఇవ్వాలన్న సీఎం ఆదేశాలకు తగ్గట్లే జాబితాను ఆయనకు అందించినట్లుగా చెబుతున్నారు. దీనిపై కేసీఆర్ తుది కసరత్తు చేసి.. సోమవారం ఫైనల్ చేయనున్నట్లుగా చెబుతున్నారు.
మంగళవారం ఉదయం 10 గంటల లోపే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మొత్తం పూర్తి కావాల్సిన నేపథ్యంలో.. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు మొత్తం మంగళవారం తెల్లవారుజాముకు పూర్తి కావాల్సి ఉంది. దీంతో.. ప్రభుత్వ పరంగా విడుదల చేయాల్సిన జీవోలు మొదలు.. కొత్త జిల్లాలకు సంబంధించిన మొత్తం పనులకు సోమవారం అర్థరాత్రి కీలకంగా మారనుంది. దీంతో.. ఈసారి పండగను పక్కన పెట్టి మరీ ఉద్యోగులు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి. దీనికి తగ్గట్లే.. అధికారులు మిగిలిన పనుల్ని పక్కన పెట్టేసి.. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన పనుల మీద పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/