భార‌త్‌ లో ఎన్నారైలు పెళ్లి చేసుకుంటే.. ఇది త‌ప్ప‌నిస‌రి!

Update: 2018-06-07 04:47 GMT
కేంద్ర‌మంత్రి మేన‌కాగాంధీ సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. ఎన్నారై పెళ్లి కొడుకులు ఏ మాత్రం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించినా ఇబ్బందులు త‌ప్ప‌వ‌న్న రీతిలో తాజాగా స‌రికొత్త ఆదేశాలు జారీ చేశారు. ఇక‌పై దేశంలో జ‌రిగే అన్ని ఎన్నారై పెళ్లిళ్ల‌ను.. పెళ్లి జ‌రిగిన 48 గంట‌ల వ్య‌వ‌ధిలోనే రిజిస్ట‌ర్ చేసుకోవాల‌ని నిర్ణ‌యించారు.

లా క‌మిష‌న్ నివేదిక‌లో చేసిన సిఫార్సుల మేర‌కు ఎన్నారైలు పెళ్లిళ్లు చేసుకున్న 30 రోజుల వ్య‌వ‌ధిలోనే రిజిస్ట‌ర్ చేసుకోవాల‌న్నారు. 30 రోజులు దాటితో రోజుకు రూ.5 చొప్పున జ‌రిమానా విధిస్తారు.

అంతేకాదు.. ఎన్నారైలు దేశంలో పెళ్లి చేసుకుంటే పెళ్లి జ‌రిగిన 48 గంట‌ల్లోపు రిజిస్ట‌రు చేసుకోవాలి. అలా జ‌ర‌గ‌కుంటే వారికి పాస్ పోర్టులు.. వీసాలు జారీ చేయ‌మ‌ని కేంద్ర‌మంత్రి మేన‌క స్ప‌ష్టం చేస్తున్నారు. గ‌డిచిన కొంత‌కాలంగా ఎన్నారై వివాహాల విష‌యంలో త‌లెత్తుతున్న వివాహ వివాదాల‌కు చెక్ చెప్పేందుకు వీలుగా తాజా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. సో.. ఎన్నారైలు ఎవ‌రైనా స‌రే.. దేశంలో పెళ్లి చేసుకుంటే.. ఆ వెంట‌నే రిజిస్ట‌ర్ చేసుకోవ‌టం త‌ప్ప‌నిస‌రి. లేదంటే తిప్ప‌లు త‌ప్ప‌వు.
Tags:    

Similar News