విశాఖను అన్ని పార్టీలూ వ‌దిలేశాయా...రీజ‌నేంటి...?

Update: 2022-05-30 12:30 GMT
ఉమ్మ‌డి విశాఖ‌ప‌ట్నం జిల్లా ప‌రిస్థితి ఏంటి? ఇక్క‌డ ఏయే ప్రాజెక్టులు తీసుకువ‌స్తున్నారు?  రాజ‌కీయంగా ఈ ప్రాంతాన్ని ఎలా డెవ‌ల‌ప్ చేయాల‌ని అనుకుంటున్నారు?  అనే విష‌యాల‌పై.. అన్ని పార్టీలూ.. వ‌దిలే శాయా? అస‌లు విశాఖ‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. నాడు.. చంద్ర‌బాబు హ‌యాంలో విశాఖ‌ను ఐటీ హ‌బ్‌గా మారుస్తాన‌ని చెప్పారు. ఆ దిశ‌గా కొన్ని చ‌ర్య‌లు తీసుకున్నారు. కానీ, ఏ ఒక్క‌టీ జగన్ హయాంలో ముందుకు సాగ‌లేదు.

కొన్ని ప‌రిశ్ర‌మ‌ల‌తో ఒప్పందాలు చేసుకున్నా.. ఎన్నిక‌ల ముందు కావ‌డంతో అవిముందుకు సాగ‌లేదు. ఇక‌, త‌ర్వాత‌.. వ‌చ్చిన వైసీపీ కూడా విశాఖ‌ను ఏకంగా పాల‌నా రాజ‌ధానిగా ప్ర‌క‌టించింది. ఆదిశ‌గా అడుగు లు కూడా వేసింది. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు అది సాకారం కాలేదు. ఇక‌, బీజేపీ తాము అధికారంలోకి వ‌స్తే.. విశాఖ‌ను ఢిల్లీకి దీటుగా అభివృద్ధి చేస్తామ‌ని చెప్పింది. కానీ అది సాధ్య‌మ‌య్యే ప‌రిస్థితి లేదు. దీంతో విశాఖ ఇప్పుడు ఎటూ కాకుండా పోయింద‌నే వాద‌న‌న వినిపిస్తోంది.

సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న న‌గ‌రాల్లో విశాఖ అత్యంత కీల‌కం. ఇక్క‌డ ఓడ‌రేవుతోపాటు.. ప‌ర్యాట‌క ప్రాంతం కూడా ఉన్నాయి. ఏమాత్రం అభివృద్ధి చేసుకున్నా.. రాష్ట్రానికి కాసుల పంట‌తోపాటు.. ఉపాధి కూడా ల‌భించేందుకు ఎన్నో అవ‌కాశాలు ఉన్నాయి.

కానీ, రాజ‌కీయంగా ఇక్క‌డ నెల‌కొన్న అనిశ్చితి కార‌ణంగా.. ఏ ఒక్క కార్య‌క్ర‌మం కూడా ముందుకు సాగ‌డం లేదు. ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్ విశాఖ‌ను తాను సినీ ఇండ‌స్ట్రీగా మార్చాల‌ని భావిస్తున్నాన‌ని... ఇక్క‌డ‌కు ఇండ‌స్ట్రీ రావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు..

కానీ.. ఇలా ఇండ‌స్ట్రీ వ‌చ్చేందుకు ఉన్న అవ‌కాశాల‌ను ఆయ‌న మెరుగు ప‌ర‌చ‌లేక పోయారు. దీంతో ఎక్క‌డి ఆలోచ‌న అక్కడే అన్న‌ట్టుగా ప‌రిస్థితి మిగిలిపోయింది. మ‌రోవైపు రాజ‌కీయంగా కూడా .. ఇక్క‌డ నేత‌ల మ‌ధ్య వివాదాలు.. విభేదాలు తార‌స్థాయిలో ఉన్నాయి.

ఇది కూడా న‌గ‌రం అభివృద్ధి చెందేందుకు పెట్టుబ డులు వ‌చ్చేందుకు ప్ర‌ధాన అడ్డంకిగా మారింద‌నే వాద‌న జోరుగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. విజ‌య‌వాడ కంటే ఎక్కువ వ‌న‌రులు ఉన్నాయ‌ని ఇక్క‌డి ప్ర‌జలు చెబుతున్నా.. దానికి అనుగుణంగా ఇక్క‌డ న‌గ‌రం అభివృద్ధి చెంద‌క‌పోవ‌డం.. రాష్ట్రానికి ఒక కీల‌క ప్రాంతం లేకుండా పోవ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News