కరోనా మహమ్మారి ఓ వైపు కోరలు చాచి కూర్చుంటే .. యువత తమకేమి కాదులే అన్న ధీమాతో మత్తులో మునిగితేలుతున్నారు. కరోనా , లాక్ డౌన్ వల్ల కొద్దిగా కంట్రోల్ అయినప్పటికీ , దేశంలో ఆన్ లాక్ ఇలా మొదలైందో లేదో, డ్రగ్ మాఫియా అలా రెచ్చిపోతోంది. యువతను టార్గెట్ గా చేసుకుని వారిని మత్తులో మునిగేలా చేస్తుంది. బార్లు, హుక్కాసెంటర్లు తెరుచుకోవడంతో విచ్చలవిడిగా యువత రెచ్చిపోతున్నారు. దీనికి తోడు మాదకద్రవ్యాలు తీసుకుంటూ కొంత మంది మైనర్లు పోలీసులకు చిక్కారు. ఇందులో 20 మంది బాలికలు, 10 మంది బాలురు ఉన్నారు. మధ్యప్రదేశ్ లోని టిటినగర్ ప్రాంతంలో ఉన్న హక్కాసెంటర్లో ఈ ఘటన జరిగింది.
జోహ్రీ హోటల్ లోని హుక్కా లాంజ్ లో కొంత మంది మైనర్లు పార్టీ నిర్వహిస్తున్నారనే సమాచారం పోలీసులకు తెలియడంతో .. స్పెషల్ టీం పోలీసులు వెంటనే హుక్కా లాంజ్ పై దాడులు నిర్వహించారు. పోలీసులు అక్కడికి వెళ్లే సమయానికే వారంతా మద్యం, మాదక ద్రవ్యాల మత్తులో ఉగిపోతుకనిపించారు. ఈ మైనర్లందరూ బర్త్ డే పార్టీ పేరుతో పార్టీ చేసుకుని మాదకద్రవ్యాలు తీసుకుంటున్నారని వెల్లడించారు. ఇక, ఆ సెంటర్ నిర్వాహకులే వారికి పెద్ద ఎత్తున డ్రగ్స్ కూడా అందుబాటులో ఉంచి వారిని మత్తులో ముంచుతున్నారని పోలీసులు తెలిపారు. వారందరిని అదుపులోకి తీసుకుని స్పెషల్ జువెనైల్ పోలీసులకు అప్పగించారు. హోటల్ నిర్వాహకులు పరారీలో ఉండటంతో పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి .. వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.